Special Trains | పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు.. మూడు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..
Special Trains | పండుగల నేపథ్యంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి–చెన్నై సెంట్రల్, చార్లపల్లి–నాగర్‌కోయిల్, సికింద్రాబాద్–విశాఖపట్నం మార్గాల్లో ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది. మూడు మార్గాల్లో రాకపోకలకు కలిపి ఆరు రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
Special Trains | పండుగల నేపథ్యంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి–చెన్నై సెంట్రల్, చార్లపల్లి–నాగర్‌కోయిల్, సికింద్రాబాద్–విశాఖపట్నం మార్గాల్లో ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది. మూడు మార్గాల్లో రాకపోకలకు కలిపి ఆరు రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. రైలు నంబర్ 07059 అక్టోబర్ 16న చర్లపల్లిలో రాత్రి 9.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07060 అక్టోబర్ 17న మధ్యాహ్నం 1 గంటకు చెన్నై సెంట్రల్లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతాయి. ఈ సర్వీసుల్లో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
నాగర్‌కోయిల్‌కు మూడు రైళ్లు..
చార్లపల్లి–నాగర్‌కోయిల్ మధ్య రైలు నంబర్ 07535 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 వరకు అందుబాటులో ఉంటుంది. చర్లపల్లిలో రాత్రి 7.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.45 గంటలకు నాగర్ కోయిల్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07536 నవంబర్ 1 నుంచి 13 వరకు రాకపోకలు సాగిస్తుంది. నాగర్ కోయిల్‌లో రాత్రి 12.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, వృద్ధాచలం, తిరుచిరాపల్లి, దిండిగల్, మధురై, విరుదునగర్, సాత్తూర్, కోవిల్పట్టి, తిరునెల్వేలి, వల్లియూర్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి.
సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య రాకపోకలు
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే రైలు నంబర్ 07069 అక్టోబర్ 16న రాత్రి 8.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07070 అక్టోబర్ 17న మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. ఈ రైళ్లు రెండు మార్గాల్లోనూ చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి. ఈ సర్వీసుల్లో ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు ఆయా రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mallikarjun Kharge | పార్లమెంటును ప్రొరోగ్ చేయడంలో ఆలస్యం.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
- ●Prabhas | ఎట్టకేలకు ప్రభాస్ కల్కి 2 షూటింగ్ షురూ - సాయిపల్లవి కోసం వెయిటింగ్?
- ●Mumbai | 18 ఏళ్ల చిన్నారిని ఆరో అంతస్తు నుంచి తోసేసిన 10 ఏళ్ల బాలిక
- ●Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు.. 18 ఏళ్లలో అత్యధిక లాభాల వారం..
- ●KTR | ఆంధ్రాలో జల పండుగ..! తెలంగాణలో క్రాప్ హాలీడే..!
- ●Ind Vs WI | ఐదో టీ20లోకి భువనేశ్వర్ కుమార్.. అర్ష్‌దీప్‌కు గాయం!

Mallikarjun Kharge | పార్లమెంటును ప్రొరోగ్ చేయడంలో ఆలస్యం.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ

Prabhas | ఎట్టకేలకు ప్రభాస్ కల్కి 2 షూటింగ్ షురూ - సాయిపల్లవి కోసం వెయిటింగ్?

Mumbai | 18 ఏళ్ల చిన్నారిని ఆరో అంతస్తు నుంచి తోసేసిన 10 ఏళ్ల బాలిక

Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు.. 18 ఏళ్లలో అత్యధిక లాభాల వారం..






