Amazon Business | అమెజాన్ బంపర్ ఆఫర్.. కార్పొరేట్ గిఫ్ట్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు..
Amazon Business | అమెజాన్ బిజినెస్ సంస్థ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సందర్భంగా కార్పొరేట్ బహుమతులు, కార్యాలయ అవసరాల ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 8న ప్రారంభమైన ఈ సేల్‌లో భాగంగా సంస్థలు, వ్యాపార వినియోగదారులు తమ ఉద్యోగులు, కస్టమర్లు, ఇతర భాగస్వాములకు బహుమతులు కొనుగోలు చేసేందుకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Amazon Business | అమెజాన్ బిజినెస్ సంస్థ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సందర్భంగా కార్పొరేట్ బహుమతులు, కార్యాలయ అవసరాల ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 8న ప్రారంభమైన ఈ సేల్‌లో భాగంగా సంస్థలు, వ్యాపార వినియోగదారులు తమ ఉద్యోగులు, కస్టమర్లు, ఇతర భాగస్వాములకు బహుమతులు కొనుగోలు చేసేందుకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ ఉత్పత్తులపై గరిష్ఠంగా 80 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఆడియో ఉత్పత్తుల విభాగంలో హెడ్ఫోన్లు, వైర్లెస్ ఇయర్‌బడ్స్, బ్లూటూత్ స్పీకర్లపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో ప్రకటించిన ధరలు ఒక్కో యూనిట్‌కు సంబంధించినవి. వీటికి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అదనం.
ఆడియో, గృహోపకరణాల విభాగంలో..
అర్హత కలిగిన బల్క్ కొనుగోళ్లపై అదనంగా 5 శాతం తగ్గింపును కూడా అందిస్తున్నారు. మరోవైపు, మొత్తం హెడ్ఫోన్లు, స్పీకర్ల విభాగంలో 70 శాతం వరకు తగ్గింపుతోపాటు, పెద్ద మొత్తంలో కొనుగోళ్లపై అదనంగా 8 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు అమెజాన్ బిజినెస్ పేర్కొంది. వంటగది ఉపకరణాల విభాగంలో మిక్సర్ గ్రైండర్లు, హ్యాండ్ బ్లెండర్లు, కాఫీ తయారీ పరికరాలపై 50 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అర్హత కలిగిన బల్క్ కొనుగోళ్లపై అదనంగా 12 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఉత్పత్తుల ధరలకు కూడా జీఎస్టీ అదనంగా ఉంటుంది. దీపావళి సందర్భంగా కార్పొరేట్ గిఫ్ట్ హ్యాంపర్లపై అమెజాన్ బిజినెస్ ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఈ విభాగంలో 75 శాతం వరకు తగ్గింపుతోపాటు, అర్హత కలిగిన బల్క్ ఆర్డర్లపై అదనంగా 14 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హైపర్ఫుడ్స్ దీపావళి కార్పొరేట్ గిఫ్ట్ హ్యాంపర్, బ్లూ టోకై కాఫీ రోస్టర్స్ ఆరణ్య గిఫ్ట్ హ్యాంపర్, ఫూల్ శుభ్ దీపావళి కార్పొరేట్ గిఫ్ట్ హ్యాంపర్, ఈట్ బెటర్ కో అసార్టెడ్ లడ్డూ గిఫ్ట్ హ్యాంపర్, ఆనంద్ దీపావళి స్వీట్స్ గిఫ్ట్ బాక్స్ వంటి ఉత్పత్తులు ఈ ఆఫర్లలో ఉన్నాయి.
బ్యాగులు, వాలెట్లు, లగేజీ..
బ్యాగులు, వాలెట్లు, లగేజీ ఉత్పత్తులపై 70 శాతం వరకు తగ్గింపు ప్రకటించారు. అర్హత కలిగిన బల్క్ కొనుగోళ్లపై అదనంగా 12 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కార్యాలయ అవసరాలకు సంబంధించిన కుర్చీలు, ఫర్నిచర్, స్టేషనరీ, పేపర్, ఫ్యాన్లు, గృహోపకరణాలు, కిచెన్ ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపును ప్రకటించారు. పారిశ్రామిక, వృత్తిపరమైన అవసరాలకు ఉపయోగించే ఉత్పత్తులపై గరిష్ఠంగా 80 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వీటిలో పారిశ్రామిక సామగ్రి, పవర్ టూల్స్, హ్యాండ్ టూల్స్, ప్యాకేజింగ్, షిప్పింగ్ సామగ్రి, వైద్య వృత్తికి అవసరమైన ఉత్పత్తులు, భద్రతా పరికరాలు ఉన్నాయి. ఈ ఆఫర్లు అమెజాన్ బిజినెస్ వేదికపై గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఉత్పత్తి అర్హత, కొనుగోలు చేసే పరిమాణాన్ని బట్టి తగ్గింపులు, బల్క్ ధరలు మారుతాయి.
బ్యాంకు ఆఫర్లు సైతం..
అర్హత కలిగిన కొనుగోళ్లపై ఎంపిక చేసిన విభాగాల్లో గరిష్ఠంగా రూ.9,999 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తున్నారు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అపరిమితంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ ప్రయోజనం అందుబాటులో ఉంది. అయితే, ఆయా ఆఫర్లకు వర్తించే నిబంధనలు, అర్హతలను కొనుగోలు చేసే ముందు పరిశీలించాలి.
సంబంధిత వార్తలు

Amazon Great Indian Festival 2026 | శామ్సంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.75 వేల వరకు తగ్గింపు..
అక్టోబర్ 10, 2026

Amazon Great Indian Festival 2026 | అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 16, 17ఈ లపై భారీ డిస్కౌంట్లు.. ఎంత తగ్గాయంటే..?
అక్టోబర్ 10, 2026

Amazon Great Indian Festival 2026 | రూ.60 వేలలోపు లభిస్తున్న బెస్ట్ ల్యాప్టాప్స్.. ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా..
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●OTT Releases | శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 30 సినిమాలు రిలీజ్ - ఒక్కోటి ఒక్కో జానర్
- ●Tummala Nageshwar Rao | వైటీపీఎస్‌కు మహానది బొగ్గును కేటాయించండి..
- ●Special Trains | పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు.. మూడు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Vodafone Idea | వొడాఫోన్ ఐడియా (వీఐ) సరికొత్త ప్రయోగం.. ప్రీపెయిడ్ ప్లాన్లలోనూ ఫ్యామిలీ షేరింగ్..
- ●Ramachander Rao | దేశంలో అధికార మార్పిడికి కుట్ర : రామచందర్ రావు
- ●Mallikarjun Kharge | పార్లమెంటును ప్రొరోగ్ చేయడంలో ఆలస్యం.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ

OTT Releases | శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 30 సినిమాలు రిలీజ్ - ఒక్కోటి ఒక్కో జానర్

Tummala Nageshwar Rao | వైటీపీఎస్‌కు మహానది బొగ్గును కేటాయించండి..

Special Trains | పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు.. మూడు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..

Vodafone Idea | వొడాఫోన్ ఐడియా (వీఐ) సరికొత్త ప్రయోగం.. ప్రీపెయిడ్ ప్లాన్లలోనూ ఫ్యామిలీ షేరింగ్..



