Supreme Court | పిల్లల కిడ్నాప్‌పై ఎఫ్ఐఆర్ తప్పనిసరి.. సుప్రీం ఆదేశాలు
Supreme Court | దేశంలో పిల్లల కిడ్నాప్‌పై భారత అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పిల్లల మిస్సింగ్ కేసులపై తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రాథమిక విచారణ పేరుతో ఆలస్యం చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్ : దేశంలో పిల్లల కిడ్నాప్‌పై భారత అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పిల్లల మిస్సింగ్ కేసులపై తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రాథమిక విచారణ పేరుతో ఆలస్యం చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది.
చిన్నారుల అక్రమ రవాణా సమస్యను తీవ్రంగా పరిగణించిన కోర్టు.. దేశంలో సుమారు 47 వేల మంది పిల్లల ఆచూకీ లేకుండా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవస్థీకృత నేరాలను అరికట్టడానికి, తప్పిపోయిన పిల్లలను త్వరగా గుర్తించడానికి దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పలు కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. జస్టిస్ అహ్రానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్ సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది.
2011లో చెన్నై సిటీలో ఓ చిన్నారి అదృశ్యమైంది. అయితే తన కుమార్తెను వెతికిపెట్టాలంటూ జి గణేశ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఈ సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుని విచారణను వేగవంతం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 47 వేల మంది చిన్నారుల ఆచూకీ లభించకుండా పోయిందని, నమోదవుతున్న కేసులకు, రికవరీ అవుతున్న పిల్లల సంఖ్యకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ధర్మాసనం పేర్కొంది. పిల్లలు తప్పిపోయినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఎటువంటి ప్రాథమిక విచారణలు చేయకుండా, ఆలస్యం లేకుండా తక్షణమే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులలో భారతీయ న్యాయ సంహిత (BNS) లోని కిడ్నాప్, అపహరణ సెక్షన్లను చేర్చడం తప్పనిసరి.
తాజావార్తలు
- ●Save the Tigers Season 3 | నవ్వులు పంచేందుకు మళ్లీ వచ్చేస్తున్న 'టైగర్స్'.. 'సేవ్ ది టైగర్స్ సీజన్ 3' క్రేజీ అప్డేట్ ఇది
- ●Delhi Gymkhana Club Eviction | ఎలైట్ ఎంపైర్‌కు ఎండ్ కార్డ్: ఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు.. జూన్ 5 డెడ్‌లైన్!
- ●Trump Brilliant Tyrant Dictator | నన్ను 'డిక్టేటర్' అనండి, కానీ 'డంబ్' అంటే ఊరుకోను: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మెంటల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!
- ●US Iran Ceasefire | అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్? మరో 60 రోజులు కాల్పుల విరమణ.. రంగంలోకి పాక్
- ●Telangana Cabinet Decisions | ఇందిరమ్మ ఇండ్లు, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, పుష్కరాలకు నిధులు.. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాల పూర్తి వివరాలివే
- ●HCA | తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్.. హెచ్‌సీఏ నిర్ణయం

Save the Tigers Season 3 | నవ్వులు పంచేందుకు మళ్లీ వచ్చేస్తున్న 'టైగర్స్'.. 'సేవ్ ది టైగర్స్ సీజన్ 3' క్రేజీ అప్డేట్ ఇది

Delhi Gymkhana Club Eviction | ఎలైట్ ఎంపైర్‌కు ఎండ్ కార్డ్: ఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు.. జూన్ 5 డెడ్‌లైన్!

Trump Brilliant Tyrant Dictator | నన్ను 'డిక్టేటర్' అనండి, కానీ 'డంబ్' అంటే ఊరుకోను: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మెంటల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!

US Iran Ceasefire | అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్? మరో 60 రోజులు కాల్పుల విరమణ.. రంగంలోకి పాక్






