త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Attapur | అత్తాపూర్‌లో యువ‌తి కిడ్నాప్.. ఆరాంఘ‌ర్ వ‌ర‌కు వెంబ‌డించిన పోలీసులు..!

Attapur | హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని అత్తాపూర్‌లో ఓ యువ‌తిని మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి గుర్తు తెలియ‌ని దుండ‌గులు కిడ్నాప్ చేసిన సంగ‌తి తెలిసిందే. థార్ కారులో వ‌చ్చిన దుండ‌గులు ఆమెను బ‌ల‌వంతంగా కిడ్నాప్ చేసిన‌ట్లు స్థానికులు పేర్కొన్నారు.

S

Hyderabad | Published On May 20, 2026, 1.43 pm IST

Attapur | అత్తాపూర్‌లో యువ‌తి కిడ్నాప్.. ఆరాంఘ‌ర్ వ‌ర‌కు వెంబ‌డించిన పోలీసులు..!
Advertisement

Attapur | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని అత్తాపూర్‌లో ఓ యువ‌తిని మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి గుర్తు తెలియ‌ని దుండ‌గులు కిడ్నాప్ చేసిన సంగ‌తి తెలిసిందే. థార్ కారులో వ‌చ్చిన దుండ‌గులు ఆమెను బ‌ల‌వంతంగా కిడ్నాప్ చేసిన‌ట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ వ్య‌వ‌హారంలో కారు ఆచూకీతో పాటు యువ‌తి వివ‌రాలు తెలుసుకునేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు.

ఆరాంఘ‌ర్ వ‌ర‌కు వెంబ‌డించిన పోలీసులు..

యువ‌తిని కిడ్నాప్ చేస్తున్న స‌మ‌యంలో స్థానికులు 100కు డ‌య‌ల్ చేయ‌గా, పోలీసులు హుటాహుటిన అక్క‌డికి చేరుకున్నారు. యువ‌తిని తీసుకెళ్తున్న కారును పోలీసులు వెంబ‌డించారు. ఆరాంఘ‌ర్ వ‌ర‌కు వెళ్లినా కూడా కారు క‌నిపించ‌లేదు. పోలీసుల క‌ళ్లుగ‌ప్పి దుండ‌గులు పారిపోయారు. అయితే కారుకు నంబ‌ర్ ప్లేట్ లేక‌పోవ‌డంతో.. దాని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసుల‌కు కాస్త ఇబ్బందిగా మారింది.

కిడ్నాపా..? మ‌రేదైనా కార‌ణ‌మా..?

యువ‌తి కిడ్నాప్‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆమెను నిజంగానే కిడ్నాప్ చేశారా..? లేక మ‌రేదైనా కార‌ణం ఉందా..? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన యువ‌తిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు ఎలాంటి ఫిర్యాదు చేయ‌లేద‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను చూసిన స్థానికులు మాత్రం ఆ యువతిని థార్ కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారని చెబుతున్నారు. దుండగుల‌కు ఆ యువ‌తి ముందే తెలిసిన‌ట్లు ఉంద‌ని పేర్కొన్నారు. ఈ ఘటన ప్రస్తుతం నగరంలో కలకలం సృష్టిస్తోంది.

Advertisement
Advertisement