Supreme Court | పాదచారులకు దారివ్వండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court | దేశంలోని ప్రతి రహదారిపై పాదచారులు (pedestrians) సురక్షితంగా నడిచేందుకు (free space for walking) ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది.
Supreme Court | దేశంలోని ప్రతి రహదారిపై పాదచారులు (pedestrians) సురక్షితంగా నడిచేందుకు (free space for walking) ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. పాదచారులకు రోడ్డుపై నడిచేందుకు సరైన మార్గం లేక ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది. ఈ మేరకు రోడ్లపై పాదచారుల ప్రాంతాలను గుర్తించి, వాకర్స్‌కోసం కేటాయించిన స్థలం ఆక్రమణకు గురి కాకుండా చూడాలని అధికారులను ఆదేశించాల్సిందిగా కోరింది.
తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్తున్న ఐదేళ్ల బాలుడిని ట్యాంకర్ ఢీ కొన్న ఘటనపై కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "ఎక్కడ రోడ్డు ఉందో, అక్కడ వాకర్స్ కోసం స్థలం ఉండాలి. ఇందుకోసం భారీగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తాడు లేదా ఇతర తాత్కాలిక గుర్తులతోనైనా పాదచారుల మార్గాన్ని స్పష్టంగా గుర్తించండి. అది ఆక్రమణకు గురి కాకుండా చూసుకోండి" అని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం రెండు వారాల గడువు ఇచ్చింది. రహదారుల పక్కన ఉన్న స్థలం తమకేనని, ఇకపై వాహనాల భయం లేకుండా నడవచ్చనే నమ్మకం పాదచారులకు కల్పించాలని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Also Read..
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. మంత్రివర్గ విస్తరణ వేళ ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ సరికొత్త అధ్యాయం
F&O ట్రేడింగ్ వేళలు పొడిగింపునకు కారణాలు: సెబీ కొత్త నిబంధనల వెనుక అసలు ఉద్దేశం ఇదే!
సంబంధిత వార్తలు

Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు
ఆగస్టు 7, 2026

CJP Abhijeet Dipke | ఒకటో తరగతికి లక్షన్నర ఫీజు అయితే.. డబ్బులు ఎక్కడ్నుంచి వస్తయ్..?
ఆగస్టు 6, 2026

Supreme Court | వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటేనే ఇంధనం..? పరిశీలిస్తున్న కేంద్రం..?
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!



