Kapur Family | మధ్యవర్తిత్వం విఫలమైతే.. సంజయ్ కపూర్ కుటుంబ ట్రస్టు కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Kapur Family | దివంగత పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్ కుటుంబ ట్రస్టు (Sunjay Kapur Family Trust Row) వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
Kapur Family | త్రినేత్ర.న్యూస్ : దివంగత పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్ కుటుంబ ట్రస్టు (Sunjay Kapur Family Trust Row) వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదానికి స్నేహపూర్వకంగా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అందుకోసం అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషించాలని ఇరుపక్షాలకు కోర్టు సూచించింది.
ప్రస్తుతం కొనసాగుతున్న మధ్యవర్తిత్వ ప్రక్రియ సంతృప్తికరంగా సాగుతోందని జస్టిస్ JB పార్థీవాలా నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. ఈ ప్రక్రియను నవంబర్ 2 వరకు కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. అప్పటిలోపు ఆస్తుల వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఒకవేళ మధ్యవర్తిత్వం విఫలమైతే.. ఇరు పక్షాలు చట్ట ప్రకారం ముందుకెళ్లేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఆ దుస్థితి రాకూడదనే కోరుకుంటున్నట్లు జస్టిస్ పార్థీవాలా వ్యాఖ్యానించారు. ఈ కుటుంబ వివాదం చర్చల ద్వారా స్నేహపూర్వకంగా పరిష్కారమవుతుందనే పూర్తి నమ్మకంతో ఉన్నామని విచారణ సందర్భంగా పేర్కొన్నారు.
కపూర్ ఫ్యామిలీ రూ.30,000 కోట్ల ఆస్తి వివాదం..
గతేడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో పోలో ఆడుతూ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ (Sunjay Kapur) మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత కపూర్ ఫ్యామిలీ ఆస్తి వివాదం మొదలైంది. సంజయ్ కపూర్ రూ. 30,000 కోట్ల ఆస్తుల విషయంలో.. ఆయన మూడో భార్య ప్రియా సచ్‌దేవ్ కపూర్, మొదటి భార్య కరిష్మా కపూర్ పిల్లల (సమైరా, కియాన్) మధ్య వివాదం కొనసాగుతోంది. రూ. 30,000 కోట్ల వారసత్వ ఆస్తి, ట్రస్టు (ఆర్కే ఫ్యామిలీ ట్రస్ట్) నియంత్రణకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.
మధ్యవర్తిగా మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్
ఫ్యామిలీ ట్రస్ట్ విషయంలో సంజయ్ కపూర్ తల్లి 80 ఏళ్ల రాణి కపూర్, ఆయన మూడో భార్య ప్రియా సచ్‌దేవ్ కపూర్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ట్రస్టుకు చెందిన ఆస్తులను అమ్మడం లేదా ట్రాన్స్‌ఫర్ చేయకుండా యథావిధిగా కొనసాగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో సంజయ్ కపూర్ కుటుంబ ట్రస్ట్ (ఆర్కే ఫ్యామిలీ ట్రస్ట్) ఆస్తి వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మే7న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ను మధ్యవర్తిగా నియమించింది. మధ్యవర్తికి చెల్లించాల్సిన ఫీజును ట్రస్టు ద్వారానే భరించాలని ఆదేశించింది.
ఆస్తుల విషయంలో కరిష్మా కపూర్ పిల్లలకు ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించిన విషయం తెలిసిందే. ప్రియా కపూర్ ఆస్తులను విక్రయించకుండా, బదిలీ చేయకుండా లేదా ఎలాంటి మూడో పక్షపు హక్కులను సృష్టించకుండా కోర్టు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో కపూర్ వీలునామాకు ఈ మధ్యవర్తిత్వం వర్తించదు. ఆర్కే ట్రస్ట్, రాణీకపూర్ ఫ్యామిలీ ట్రస్ట్, సోనా కామ్‌స్టార్, కపూర్ కుటుంబంతో సంబంధం ఉన్న ఇతర కంపెనీలకు సంబంధించి మాత్రమే మధ్యవర్తిత్వం జరుగుతుంది.
మహాభారతాన్ని మించిపోయింది..
ఇక ఈ కుటుంబ వివాదాన్ని కోర్టు గతంలో మహాభారతం (Mahabharatam)తో పోల్చిన విషయం తెలిసిందే. దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకరిపై ఒకరు వేసుకుంటున్న పిటిషన్ల వెల్లువను చూసి ధర్మాసనం వ్యంగ్యంగా స్పందించింది. "మేము ఒక యుద్ధ క్షేత్రంలోకి ప్రవేశించాం. దీని ముందు మహాభారతం కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది" అంటూ జస్టిస్ పార్థీవాలా గత విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Also Read..
ఈ20 ఇంధనం పర్యావరణానికి అనుకూలం కాదు : జైరామ్ రమేష్
జయశంకర్ సార్ చెప్పినట్టు మాట్లాడితే.. అసెంబ్లీ ఇటుకలు సైతం జై తెలంగాణ అనక తప్పలే
వాట్సాప్ గ్రూప్ చాట్స్‌లో భారీ మార్పులు.. పోల్స్, ఎట్ ఆల్, కొత్త గ్రూప్ ఫీచర్లు అందుబాటులోకి..
సంబంధిత వార్తలు

NEET-UG | నీట్ పరీక్ష విధానంలో కీలక మార్పులు.. పెన్-అండ్-పేపర్ విధానానికి స్వస్తి
ఆగస్టు 6, 2026

Supreme Court | కోర్టు విచారణలపై వార్తా సంస్థలు రిపోర్టింగ్ చేయొచ్చు.. కానీ : సుప్రీంకోర్టు
ఆగస్టు 5, 2026

Supreme Court | విద్యార్థి నిరసనకారులపై హింసాత్మక చర్యలొద్దు.. సంయమనం పాటించాలి : సుప్రీంకోర్టు
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Makutam Movie | విశాల్ ‘మకుటం’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. రేపే ట్రైలర్ విడుదల
- ●Rukmini Vasanth | రామ్‌చరణ్ సరసన రుక్మిణి వసంత్..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●KTR | మూడు తరాలను ముంచిందే కాంగ్రెస్సని సార్ చెప్పేవారు.. అందుకే ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలనేవారు
- ●Shivcharan Gupta Sonipat | కోట్లు సంపాదించిన తండ్రికి చివరికి మిగిలింది రూ.5100.. వీడియో కాల్లో అంత్యక్రియలు
- ●Mallikarjun Kharge | విద్యార్థులపై పోలీసుల చర్య.. సభలో ప్రకటన చేయడానికి అమిత్‌షాకు ఏం అడ్డంకులు ఉన్నాయ్..?

Makutam Movie | విశాల్ ‘మకుటం’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. రేపే ట్రైలర్ విడుదల

Rukmini Vasanth | రామ్‌చరణ్ సరసన రుక్మిణి వసంత్..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..

KTR | మూడు తరాలను ముంచిందే కాంగ్రెస్సని సార్ చెప్పేవారు.. అందుకే ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలనేవారు



