Congress survey | ఇప్పుడే ఎన్నికలొస్తే బీఆర్ ఎస్ క్లీన్ స్వీప్.. నిగ్గు తేల్చిన కాంగ్రెస్ సర్వే
Congress survey | కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేయించుకున్న మధ్యంతర సర్వేలో ఆ పార్టీకి కోలుకోలేని షాక్ లాంటి నిజాలు బయటపడ్డాయి. ఇప్పటికిప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికలు జరిగితే అన్ని నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేస్తుందని వెల్లడైంది.
ఉమ్మడి వరంగల్ లో బీఆర్ ఎస్ క్లీన్ స్వీప్.. నిగ్గు తేల్చిన కాంగ్రెస్ సర్వే
త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ (INC) పార్టీ ప్రతిష్టాత్మకంగా చేయించుకున్న మధ్యంతర సర్వేలో ఆ పార్టీకి కోలుకోలేని షాక్ లాంటి నిజాలు బయటపడ్డాయి. ఇప్పటికిప్పుడు ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో ఎన్నికలు జరిగితే అన్ని నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితి (BRS) క్లీన్ స్వీప్ చేస్తుందని వెల్లడైంది. గురువారం ఉదయమే శాంపుల్స్ పూర్తి చేసి లెక్కలు చూస్తే కాంగ్రెస్ కు ఒక్క సీటూ రావడం లేదని సర్వే సంస్థ వెల్లడించింది...
12కు 12 గులాబీవేనట
దేశవ్యాప్తంగా పోల్ సర్వేలు నిర్వహించడంలో చాణక్య.కామ్ (www.Chanakyya.com) కు మంచి పేరున్నది. ప్రజాపాలన పూర్తై రెండున్నరేండ్లు పూర్తైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ సంస్థను పిలిపించి స్వతంత్రంగా సర్వే చేయించుకున్నది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాణక్య సంస్థ 12 నియోజకవర్గాల్లో దాదాపుగా 14వేల శాంపుల్స్ సేకరించింది. అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా 40 నుంచి 55 శాతం వరకు బీఆర్ ఎస్ (BRS) వైపుకు ఓటర్లు మొగ్గు చూపినట్టు విశ్వసనీయ సమాచారం. శాంపుల్స్ కు సంబంధించి.. వాటి పలితాలకు ఆ సంస్థ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆ సంస్థ తరపున సర్వే చేసిన అధికార ప్రతినిధి ఈ విషయాన్ని ఎక్స్ హ్యాండిల్ లో పంచుకున్నారు.
ఆయనేమన్నారంటే..
చాణక్య సంస్థకు చెందిన పార్థదాస్ (@partha2019LS) ఐఐఎం గ్రాడ్యుయేట్. ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా.. ఆయన ఆ రాష్ట్రంలో వాలిపోతారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయో సర్వే చేసి కచ్చితంగా చెప్పగలిగింది ఈ సంస్థనే. అయితే.. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆయన శాంపుల్స్ రిజల్ట్ సంబంధించి బ్రేకింగ్ షేర్ చేశాడు. "ఇవాళ ఉదయం ఉమ్మడి వరంగల్ జిల్లా శాంపుల్స్ పూర్తయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది" అని వెల్లడించాడు. కాగా 2023 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 కాంగ్రెస్ గెలవగా 2 సీట్లను మాత్రమే బీఆర్ ఎస్ గెలుచుకున్నది.
We just finished our samples in Warangal district of Telangana. If Election happens today, BRS will sweep the district.
— Partha Das (@partha2019LS) August 6, 2026
సంబంధిత వార్తలు

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..
సెప్టెంబర్ 22, 2026

Parenting | భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!.. పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే..!
సెప్టెంబర్ 22, 2026

Election Commission | యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..
- ●Parenting | భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!.. పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే..!
- ●Election Commission | యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
- ●మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!
- ●Tamil Nadu | తమిళనాడు సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రతి ఇంటికీ రూ.22వేల వరకు సోలార్ పథకం సబ్సిడీ..
- ●Delhi Park | పోలీసులమని బెదిరించి.. ఢిల్లీ పార్క్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్.. 10 రోజుల్లో నాలుగో ఘటన

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..

Parenting | భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!.. పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే..!

Election Commission | యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!



