Jairam Ramesh | ఈ20 ఇంధనం పర్యావరణానికి అనుకూలం కాదు : జైరామ్ రమేష్
Jairam Ramesh | కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ20 ఇంధన (E20 fuel) పర్యావరణానికి అనుకూలం కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) ఆరోపించారు. దీని వెనుక నీటి వనరుల విధ్వంసం, ఆహార భద్రతకు ముప్పు వంటి పర్యావరణ వ్యతిరేక కోణాలు ఉన్నాయని చెప్పారు.
Jairam Ramesh | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ20 ఇంధన (E20 fuel) కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశాలు పర్యావరణ అనుకూలమైనవి కావని కాంగ్రెస్ (Congress) పార్టీ ఆరోపించింది. దీని వెనుక నీటి వనరుల విధ్వంసం, ఆహార భద్రతకు ముప్పు వంటి పర్యావరణ వ్యతిరేక కోణాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) ఆరోపించారు.
స్వచ్ఛ ఇంధనం, చమురు దిగుమతులను తగ్గించే చర్యల్లో భాగంగా మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ20 ఇంధనాన్ని వేగంగా అమల్లోకి తేవాలని యోచిస్తోందని జైరామ్ రమేష్ అన్నారు. అయితే దీనివల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అన్ని కోణాల నుంచి లోతుగా పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ20 ఇంధనం వల్ల నీటి వనరులు, ఆహార భద్రతపై పడే ప్రభావం ఎంతనేది పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇతర దేశాలు ఎక్కువగా వ్యవసాయ వ్యర్థాలు, ఇతర వ్యర్థ జీవపదార్థాల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. కానీ మన దేశంలో ఇథనాల్ ఉత్పత్తి ప్రధానంగా నీరు ఎక్కువగా అవసరమయ్యే చెరకు, వరి, మొక్కజొన్న వంటి పంటలపై ఆధారపడి ఉందన్నారు.
70% నీరు వరి, చెరకుకే..
అధిక నీటి వినియోగం గల ఈ పంటలు మన వనరులపై చూపుతున్న ఒత్తిడి ఆందోళనకరంగా ఉందన్నారు. భారతదేశంలోని సాగునీటిలో దాదాపు 70 శాతం చెరకు, వరి పంటకే పోతోందని చెప్పారు. ఒక లీటరు చెరకు ఇథనాల్‌కు 3,630 లీటర్లు, వరి ఇథనాల్‌కు 10,790 లీటర్ల నీరు అవసరమవుతుందని చెప్పారు. అదేవిధంగా మొక్కజొన్న ఆధారిత ఇథనాల్‌కు కూడా ఒక లీటరు ఇంధనానికి సుమారు 4,670 లీటర్ల నీరు అవసరమని వివరించారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని.. ఇలాంటి సమయంలో ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. 2021 నాటి నీతి ఆయోగ్ ఇథనాల్ రోడ్‌మ్యాప్ ఆహారేతర, సుస్థిరమైన ఫీడ్‌స్టాక్‌ల (ముడి పదార్థాల) వినియోగాన్ని పెంచాలని సిఫార్సు చేసిందని ఈ సందర్భంగా జైరామ్ రమేష్ గుర్తు చేశారు. కానీ మోదీ ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తి కోసం బియ్యం వినియోగాన్ని సబ్సిడీ చేస్తోందని ఆరోపించారు. డిస్టిలరీలకు సగటు సేకరణ ధర కంటే 40 శాతం తక్కువకే వరిని సరఫరా చేస్తూ ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
Also Read..
నా ఖాతాను ఎందుకు నిలిపివేశారు..? మెటాపై కేజ్రీవాల్ ఆగ్రహం
కానూరులో నీట్ కోచింగ్.. కుటుంబానికి దూరంగా ఉండలేక హైదరాబాద్ యువతి బలవన్మరణం
సంబంధిత వార్తలు

Ramchander Rao | ‘సర్’లో ఆ మూడు పార్టీలు అక్రమాలు : రామచందర్ రావు
ఆగస్టు 8, 2026

Womens Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ Vs రిజుజు.. ఎక్స్ వేదికగా మాటల యుద్ధం
ఆగస్టు 8, 2026

Congress Whip | ఆ మూడురోజులు పార్లమెంట్‌కు రావాలి.. సభ్యులకు విప్ జారీ చేసిన కాంగ్రెస్
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్
- ●Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!
- ●Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!
- ●IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!
- ●Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!
- ●Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది

Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్

Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!

Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!

IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!



