Silver Price | వెండి ధర రూ.2 లక్షలకు చేరనుందా..? 2 రోజుల్లోనే రూ.11వేలు జంప్..
Silver Price | దేశీయ మార్కెట్లో వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలోనే కిలో వెండిపై రూ.11,248 పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం, పండుగల సీజన్‌లో కొనుగోళ్లు పెరగడం వంటి పరిణామాలతో వెండి ధర మళ్లీ రూ.2 లక్షల మార్కును చేరుకునే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Silver Price | దేశీయ మార్కెట్లో వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలోనే కిలో వెండిపై రూ.11,248 పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం, పండుగల సీజన్‌లో కొనుగోళ్లు పెరగడం వంటి పరిణామాలతో వెండి ధర మళ్లీ రూ.2 లక్షల మార్కును చేరుకునే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఒక్క సెషన్‌లోనే భారీ లాభం..
ఇటీవల భారీగా పడిపోయిన వెండి ధరలు తిరిగి పుంజుకుంటున్నాయి. గురువారం ఎంసీఎక్స్‌లో వెండి ఫ్యూచర్స్ కిలోకు రూ.1,88,787 వద్ద ట్రేడయ్యాయి. అంతకుముందు ఇంట్రాడేలో రూ.1,90,946 గరిష్ఠ స్థాయిని తాకాయి. రెండు ట్రేడింగ్ సెషన్లలోనే కిలో వెండిపై రూ.11,248 (6.25 శాతం) పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా స్పాట్ సిల్వర్ ధర 1.7 శాతం పెరిగి ఔన్సుకు 53.12 డాలర్లకు చేరింది. అంతకుముందు సెషన్‌లోనూ దాదాపు 5 శాతం లాభపడింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఓటమి, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లలో కీలక మార్పులకు కారణమయ్యాయి. ముడి చమురు ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గి, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్, డాలర్ విలువపై ఒత్తిడి పెరిగింది. తక్కువ బాండ్ ఈల్డ్స్, బలహీనమైన డాలర్ సాధారణంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు అనుకూలంగా ఉంటాయి.
మద్దతు ధర ఎక్కడ..?
సెప్టెంబర్‌లో వెండి ధరలు 9 శాతానికి పైగా, అక్టోబర్‌లో 18 శాతం పడిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం సాంకేతికంగా రికవరీ కనిపిస్తోందని ఇండస్‌ఇండ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది అభిప్రాయపడ్డారు. దీపావళికి ముందు చివరి నిమిషంలో కొనుగోళ్లు కూడా ధరలకు మద్దతునిస్తాయని పేర్కొన్నారు. వెండి ధరల సాంకేతిక సంకేతాలు సానుకూలంగా మారుతున్నాయని ఎన్‌రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ తెలిపారు. రూ.1.76 లక్షల నుంచి రూ.1.80 లక్షల మధ్య వెండి ధరలకు రెండుసార్లు మద్దతు లభించడం డబుల్ బాటమ్ ఏర్పాటుకు సంకేతమని వివరించారు. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (ఆర్ఎస్ఐ) ప్రస్తుతం 37 సమీపంలో ఉండగా, ఓవర్‌సోల్డ్ స్థాయి నుంచి కోలుకుంటున్నట్లు సూచిస్తోంది. ఎంఏసీడీ హిస్టోగ్రామ్ తగ్గుతుండడం కూడా అమ్మకాల ఒత్తిడి క్రమంగా తగ్గుతోందని తెలియజేస్తోంది. అయితే రూపాయి విలువ పెరగడం అంతర్జాతీయ ధరల పెరుగుదల ప్రభావాన్ని కొంత పరిమితం చేస్తోంది.
రూ.2 లక్షలకు చేరుతుందా..?
ఎంసీఎక్స్‌లో కిలో వెండికి రూ.1.86 లక్షల నుంచి రూ.1.88 లక్షల స్థాయిలు తక్షణ మద్దతుగా ఉండనున్నాయి. ఈ స్థాయిల కంటే దిగువకు పడిపోతే రూ.1.78 లలక్షల నుంచి రూ.1.80 లక్షల వద్ద మరో మద్దతు లభించే అవకాశం ఉంది. పైవైపు రూ.1.94 లక్షల నుంచి రూ.1.96 లక్షల స్థాయిల వద్ద తొలి నిరోధం ఉండగా, రూ.2 లక్షల నుంచి రూ.2.02 లక్షల మధ్య తదుపరి నిరోధం కనిపిస్తోంది. జిగర్ త్రివేది అంచనా ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో వెండికి ఔన్సుకు 48-50 డాలర్ల వద్ద మద్దతు, 55-60 డాలర్ల వద్ద నిరోధం ఉంది. దేశీయ మార్కెట్లో దీర్ఘకాలిక నిరోధ స్థాయిలు రూ.2.10 లక్షల నుంచి రూ.2.20 లక్షల వరకు ఉంటాయని విశ్లేషించారు. అయితే గత నెలలో నమోదైన భారీ నష్టాల నేపథ్యంలో ధరలు పెరిగినప్పుడు అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశాన్ని కూడా విస్మరించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | ప్రభుత్వం రూ.88.50 కోట్ల నిధులిచ్చింది.. కార్తీక మాసంలోనే ఆత్మగౌరవ భవనాల పనులు ప్రారంభించండి
- ●Supreme Court | విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్.. నెలాఖరులోపు నివేదిక ఇవ్వండి
- ●CP Sumathi | అండాల సేకరణ వ్యవహారంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు: సీపీ సుమతి
- ●Revanth Reddy Kodangal Tour | కొడంగల్‌కు రూ.9,100 కోట్ల అభివృద్ధి వరాలు: సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పర్యటన.. ప్రాజెక్టుల పూర్తి వివరాలివే!
- ●Supreme Court | UGC నిబంధనలను పునఃపరిశీలిస్తాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
- ●Cm Vijay | మళ్లీ కెమెరాముందుకు సీఎం విజయ్ .. కానీ ....

Ponnam Prabhakar | ప్రభుత్వం రూ.88.50 కోట్ల నిధులిచ్చింది.. కార్తీక మాసంలోనే ఆత్మగౌరవ భవనాల పనులు ప్రారంభించండి

Supreme Court | విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్.. నెలాఖరులోపు నివేదిక ఇవ్వండి

CP Sumathi | అండాల సేకరణ వ్యవహారంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు: సీపీ సుమతి

Revanth Reddy Kodangal Tour | కొడంగల్‌కు రూ.9,100 కోట్ల అభివృద్ధి వరాలు: సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పర్యటన.. ప్రాజెక్టుల పూర్తి వివరాలివే!






