త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sumathi | అండాల సేక‌ర‌ణ వ్య‌వ‌హారంలో చ‌ట్ట‌విరుద్ధ కార్య‌క‌లాపాలు: సీపీ సుమ‌తి

CP Sumathi | హైదరాబాద్‌లో మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరించిన కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజ్‌గిరి సీపీ సుమతి (Malkajgiri CP Sumathi) అన్నారు. నిందితుల వ‌ద్ద‌ హార్మోన‌ల్‌ ఇంజక్షన్లు (Hhormonal Injection) గుర్తించామని చెప్పారు.

G

Hyderabad | Published On Nov 5, 2026, 4.55 pm IST

CP Sumathi | అండాల సేక‌ర‌ణ వ్య‌వ‌హారంలో చ‌ట్ట‌విరుద్ధ కార్య‌క‌లాపాలు: సీపీ సుమ‌తి
Advertisement

CP Sumathi | త్రినేత్ర న్యూస్‌: హైదరాబాద్‌లో మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరించిన కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజ్‌గిరి సీపీ సుమతి (Malkajgiri CP Sumathi) అన్నారు. నిందితుల వ‌ద్ద‌ హార్మోన‌ల్‌ ఇంజక్షన్లు (Hhormonal Injection) గుర్తించామని, కానీ మహిళలకు వాటిని ఇచ్చారా లేదా అనేది ఇంకా తెలియదని చెప్పారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని వెల్ల‌డించారు. తొలుత దీనిని వ్యభిచార సంబంధిత రాకెట్‌గా భావించి విచారణ చేపట్టామ‌ని, ఈక్ర‌మంలో అండాల సేకరణ వ్యవహారం వెలుగులోకి వచ్చింద‌న్నారు.

ఎగ్ డొనేషన్ వ్యవహారంలో (Egg Harvesting Racket) చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగినట్లు అనుమానాలున్నాయ‌ని చెప్పారు. మహిళలకు హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాలు సేకరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు. ఏఆర్టీ సెంటర్లు, ఫెర్టిలిటీ సెంటర్ల మధ్య వేర్వేరు బాధ్యతలు ఉంటాయ‌న్నారు. అండాల డొనేషన్ కోసం ఏఆర్టీ సెంటర్ ద్వారానే ఫెర్టిలిటి సెంటర్‌కు (Fertility Centre) సమాచారం వస్తుందని తెలిపారు. ఏఆర్‌టీ నుంచి అన్నిరకాల డాక్యుమెంట్‌లు సేకరించిన తర్వాత మిగతా ప్రక్రియ జరుగుతుందని వెల్ల‌డించారు. అయితే ఏఆర్టీ సెంటర్ల ద్వారా బాధితులతో సంప్రదింపులు జరిపినట్లు విచారణలో పరిశీలిస్తామ‌ని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇలాంటి వ్యవహారంపై తొలిసారిగా సమాచారం అందడంతో పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదించారని వెల్ల‌డించారు. తల్లి కావాలనుకునే వారు బిడ్డ ఆరోగ్యంపై ఆలోచిస్తున్నా.. అండం ఎలా సేకరిస్తున్నారనే అంశాన్ని పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో అందరినీ నిందితులుగా పరిగణించలేమని స్ప‌ష్టం చేశారు. ఎవరి పాత్రకు సంబంధించి ఆధారాలు లభిస్తే వారినే నిందితులుగా గుర్తిస్తాం చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు మూడు ఫెర్టిలిటి సెంటర్ల‌లో సోదాలు నిర్వ‌హించామ‌న్నారు. 22 ఫెర్టిలిటీ సెంటర్‌లతో ఏఆర్‌టీ సెంటర్‌లకు (ART Centre) లింకులు ఉన్నాయని.. వాటి గురించి ఆరా తీస్తున్నామని వెల్ల‌డించారు. మహిళలకు పెండ్లి కాకపోయినా జరిగినట్లుగా, భర్త లేకున్నా ఉన్నట్లుగా చెప్పి అండాలను సేకరించారని సీపీ తెలిపారు.

Advertisement
Advertisement