త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | అంద‌రికీ గ‌ర్భాల‌య ద‌ర్శ‌నం ఉండాల‌న్న పిటిష‌న‌ర్‌.. ఆ విష‌యాల్లో జోక్యం చేసుకోలేమ‌న్న కోర్టు..

Supreme Court | ఆల‌యాల‌కు సంబంధించిన విష‌యాల్లో తాము జోక్యం చేసుకోలేమ‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జ‌యినిలోని ప్ర‌ముఖ క్షేత్ర‌మైన మ‌హాకాళేశ్వ‌ర్ ఆల‌యంలో గ‌ర్భాల‌యంలో వీఐపీ ద‌ర్శ‌నాల‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం మంగ‌ళ‌వారం కొట్టివేసింది.

P

National | Published On Jan 27, 2026, 3.33 pm IST

Supreme Court | అంద‌రికీ గ‌ర్భాల‌య ద‌ర్శ‌నం ఉండాల‌న్న పిటిష‌న‌ర్‌.. ఆ విష‌యాల్లో జోక్యం చేసుకోలేమ‌న్న కోర్టు..
Advertisement

Supreme Court | ఆల‌యాల‌కు సంబంధించిన విష‌యాల్లో తాము జోక్యం చేసుకోలేమ‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జ‌యినిలోని ప్ర‌ముఖ క్షేత్ర‌మైన మ‌హాకాళేశ్వ‌ర్ ఆల‌యంలో గ‌ర్భాల‌యంలో వీఐపీ ద‌ర్శ‌నాల‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం మంగ‌ళ‌వారం కొట్టివేసింది. ఆల‌యాల్లో ద‌ర్శ‌నాల వేళ‌లు, నిబంధ‌న‌ల‌తో పాటు విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు త‌మ ప‌రిధిలోకి రావ‌ని సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, ఆర్ మ‌హాదేవ‌న్‌, జాయ్‌మాల్య బాగ్చిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. ఇవ‌న్నీ ఆల‌య యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లాల‌ని పిటిష‌న‌ర్ ద‌ర్ప‌ణ్ అవ‌స్థీకి సూచించింది. ఈ క్ర‌మంలో పిటిష‌న‌ర్ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది విష్ణు శంక‌ర్ జైన్ పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకునేందుకు అనుమ‌తి కోరారు. త‌మ అభిప్రాయాల‌ను అధికారుల‌కు తెలియ‌జేస్తాన‌ని తెలిపారు.

ప్రాథ‌మిక హ‌క్కుల‌న్నీ కోరుత‌రు..

అయితే, మ‌హాకాళేశ్వ‌ర్ గ‌ర్భాల‌యంలో శివ‌లింగానికి జ‌లాభిషేకం చేయ‌డానికి వీఐపీల‌కు ప్ర‌త్యేక ప్ర‌వేశం క‌ల్పించ‌డాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్ కొట్టివేసింది. దాంతో పిటిష‌న‌ర్ సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. ఆల‌యానికి వ‌చ్చే ప్ర‌తి పౌరుడిని స‌మానంగా చూడాల‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టులో వాద‌న‌లు వినిపించారు. అయితే, ఆల‌య నిర్వ‌హ‌ణ‌లో న్యాయ‌వ్య‌వ‌స్థ జోక్యానికి ప‌రిమితులు ఉన్నాయ‌ని.. ఇలాంటి విష‌యాల్లో ఆల‌య బాధ్య‌త‌ల్లో ఉన్న వారే నిర్ణ‌యం తీసుకువాల‌ని సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ అన్నారు. వీఐపీల‌ను అనుమ‌తించాలా? వ‌ద్దా? అనేది కోర్టు నిర్ణ‌యించాల్సిన విష‌యం కాద‌ని.. ఆల‌యంలో ప్రాథ‌మిక హ‌క్కుల‌ను క‌ఠినంగా అమ‌లు చేయ‌డంతో ఊహించ‌ని ప‌రిణామాలు సంభ‌వించ‌వ‌చ్చ‌న్నారు. గ‌ర్భ‌గుడిలో ఆర్టిక‌ల్ 14 (సమానత్వ హక్కు) వర్తిస్తుందని మనం భావిస్తే.. అప్పుడు ప్రజలు ఆర్టికల్ 19 (వాక్ స్వాతంత్య్రం) వంటి ఇత‌ర హ‌క్కుల‌ను కోరుతార‌న్నారు. వేరెవాళ్లు వెళ్తున్నారు కాబ‌ట్టి నాకు ప్ర‌వేశించే హ‌క్కు ఉంద‌ని మీరంటారు.. ఆ త‌ర్వాత నాకు మాక్ స్వాతంత్య్రం ఉంది కాబ‌ట్టి ఇక్క‌డ మంత్రాల‌ను ప‌ఠించే హ‌క్కుంద‌ని అంటారు.. అప్పుడు ఆల‌యంలో అన్ని ప్రాథ‌మిక హ‌క్కుల‌ను కోరుతార‌ని సీజేఐ వ్యాఖ్యానించారు.

అంద‌రికీ ప్ర‌వేశం ఉండాల‌న్న పిటిష‌న‌ర్‌..

వీఐపీ హోదా ఆధారంగా పౌరుల‌పై వివక్ష చూపకూడదని విష్ణు శంకర్ జైన్ వాదించారు. ఎవరైనా గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నారంటే, అది తరచుగా కలెక్టర్ సిఫార్సు కారణంగానే జ‌రుగుతోంద‌ని.. సాధారణ భక్తుడికి కూడా దేవుడికి జలాభిషేకం చేయడానికి అదే హక్కు ఉండాల‌న్నారు. అంద‌రికీ ప్ర‌వేశాన్ని పూర్తిగా నిషేధించాల‌ని.. లేదంటే అంద‌రికీ స‌మానంగా ప్ర‌వేశాన్ని క‌ల్పించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. గ‌తంలో ఏ చ‌ట్టంలో గానీ, నిబంధ‌న‌ల్లో గానీ వీఐపీ అనే ప‌దాన్ని నిర్వ‌హించ‌లేద‌ని.. అది ఆలయ నిర్వహణ కమిటీ, కలెక్టర్ చూడాల్సిన ప‌రిపాల‌నకు సంబంధించిన విష‌య‌మ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement