త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sunetra Pawar | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం

సునేత్రతో మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్రాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే హాజరయ్యారు.

J

National | Published On Jan 31, 2026, 6.24 pm IST

Sunetra Pawar | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం
Advertisement

Sunetra Pawar | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దివంగత నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ శనివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ బాధ్యతలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం సునేత్ర పవార్‌ని ఎన్సీపీ పార్టీ శాసనసభా పక్షనేతగా ఎన్నుకొని అజిత్ పవార్ రాజకీయ వారసురాలిగా ఎన్సీపీ ప్రకటించింది. మహాయుతి కూటమిలోని ఇతర పార్టీలతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అజిత్ పవార్ పార్టీ, ఆయన ఫ్యామిలీ నిర్ణయానికి మద్దతు పలకడంతో సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సునేత్రతో మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్రాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే హాజరయ్యారు.

Advertisement

తాజావార్తలు

Advertisement