Mohan Bhagwat | హిందువులు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలి : మోహన్ భాగవత్
Mohan Bhagwat | దేశంలో హిందూ జనాభా క్షీణించడంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ (RSS Chief) మోహన్ భాగవత్ (Mohan Bhagwat) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు హిందువులు కనీసం ముగ్గురు పిల్లల్ని (Three Child Policy) కనాలని పిలుపునిచ్చారు.
Mohan Bhagwat | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ (RSS Chief) మోహన్ భాగవత్ (Mohan Bhagwat) సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజం (Hindu Society) ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. దేశంలో హిందూ జనాభా క్షీణించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు హిందువులు కనీసం ముగ్గురు పిల్లల్ని (Three Child Policy) కనాలని పిలుపునిచ్చారు. లక్నోలోని సరస్వతి శిశు మందిర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
భారత్‌లో హిందువుల జనాభా క్రమంగా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ సమాజం ఏకం కావాలని, జనాభా క్షీణతను అరికట్టేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. హిందువులు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని సూచించారు. లేకపోతే హిందూ ధర్మం ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. "హిందువులను శక్తిమంతం చేయాలి. ప్రస్తుతానికి ఎలాంటి ముప్పూ లేదు. కానీ అప్రమత్తత వసరం" అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక కుటుంబంలో సగటున ముగ్గురు కంటే తక్కువ పిల్లలు ఉన్న ఏ సమాజమైనా భవిష్యత్ తరాలలో అంతరించిపోయే ప్రమాదం ఉందని శాస్త్రీయ అభిప్రాయాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.
కొత్తగా పెళ్లై జంటలకు దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. అదేవిధంగా బలవంతపు, ప్రలోభాలతో కూడిన మత మార్పిడులకు వెంటనే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. అక్రమ చొరబాటుదారుల్ని గుర్తించి వారిని దేశం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యత ప్రాముఖ్యతను ఆయన వివరించారు. మనమందరం ఒకే మాతృభూమి బిడ్డలమని, కాలక్రమేణా అలవాటుగా మారిన వివక్షను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. అంతర్గత, బాహ్య సవాళ్ల పట్ల అప్రమత్తంగా ఉంటూ హిందూ సమాజం తన గుర్తింపును, భవిష్యత్తును కాపాడుకోవాలని హితవు పలికారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాగా, మోహన్ భగవత్ గతంలోనూ ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ●PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
- ●Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు
- ●Stock Markets | ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..
- ●RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్
- ●Cockroach Janta Party | "ఏ ఒక్కరినీ వదిలిపెట్టం": అర్ధరాత్రి ప్రభుత్వంతో CJP చర్చలు సఫలం.. కేసుల మాఫీకి హామీ!

PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు

Stock Markets | ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..






