త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minor Driving Fine | మైనర్​కు కారు ఇచ్చిన తండ్రి.. మూడేండ్ల‌ జైలు, రూ.25వేలు ఫైన్

G

National | Published On Feb 22, 2026, 10.46 am IST

Minor Driving Fine | మైనర్​కు కారు ఇచ్చిన తండ్రి.. మూడేండ్ల‌ జైలు, రూ.25వేలు ఫైన్
Advertisement

Minor Driving Fine | త్రినేత్ర‌.న్యూస్‌: ట్రాఫిక్ నియ‌మాల‌ ఉల్లంఘన కేసులో ఓ తండ్రికి కోర్టు షాక్ (Minor Driving Fine) ఇచ్చింది. జ‌మ్ముక‌శ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి.. త‌న‌ మైనర్ కుమారుడికి కారు న‌డిపేందుకు ఇచ్చాడు. దీంతో అత‌డిని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో మైన‌ర్‌కు కారు ఇచ్చినందుకుగాను ఆ వ్యక్తికి శ్రీనగర్ స్పెషల్ మొబైల్ మేజిస్ట్రేట్ (ట్రాఫిక్) కోర్టు మూడేండ్ల‌ జైలు శిక్ష విధించింది. దాంతోపాటు రూ.25 వేలు జరిమానా విధించింది. కారు రిజిస్ట్రేషన్‌ను ఏడాదిపాటు రద్దు చేయాలని ఆదేశించించింది.

కొద్ది దూర‌మే క‌దా, ముచ్చ‌డ‌ప‌డుతున్నార‌ని చెప్పి స‌రైన వ‌య‌సు రాకుండా పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు త‌మ వాహ‌నాలు ఇస్తున్నారు. దీంతో వారు ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం గ‌తేడాది కొత్త వాహ‌న చ‌ట్టం అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింది. దీంతో మైన‌ర్లు వాహ‌నాలు న‌డుపుతూ ప‌ట్టుబ‌డితే పోలీసులు క‌ఠిన శిక్ష‌లు విధిస్తున్నారు.

మైనర్ డ్రైవింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు, మోటారు వాహన చట్టంలోని సవరణల ప్రకారం..
తల్లిదండ్రులకు లేదా యజమానికి.. 3 ఏండ్ల‌ వరకు జైలు శిక్ష, రూ.25,000 జరిమానా, వాహనం రిజిస్ట్రేషన్‌ను (RC) 12 నెలల పాటు రద్దు

డ్రైవింగ్ చేసిన మైనర్‌కు.. జువైనల్ చట్టాల కింద కేసు నమోదుచేస్తారు. అత‌నికి 25 ఏండ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హతను కోల్పోతారు.

అందువ‌ల్ల పోలీసులు పట్టుకుంటే.. జరిమానా కడితే సరిపోతుందనే అపోహలో చాలామంది తల్లిదండ్రులు ఉంటున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. జరిమానాతో పాటు, జైలు శిక్ష, వాహనం సీజ్, లైసెన్స్ రద్దు వంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Advertisement
Advertisement