South Central Railway | దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు.. 12 రోజుల్లో ‘కోటి’ మంది ప్రయాణం..!
South Central Railway | దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు సృష్టించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 12 రోజుల్లోనే కోటి మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చింది.
South Central Railway | త్రినేత్ర.న్యూస్ : దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు సృష్టించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 12 రోజుల్లోనే కోటి మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మొత్తం 209 ప్రత్యేక రైళ్లను నడిపింది.
జనవరి 7 నుంచి 18వ తేదీ వరకు సాధారణ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను నడిపారు. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి, చర్లపల్లి, వికారాబాద్, తిరుపతి, తిరుచానూరు, నాందేడ్ స్టేషన్ల నుంచి నడిపించారు. ప్రధానంగా విజయవాడ, కాకినాడ, అనకాపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, శ్రీకాకుళం, బెంగళూరుతో పాటు పలు స్టేషన్లను కలుపుతూ ఈ ప్రత్యేక రైళ్లు నడిచాయి. ఈ 12 రోజుల్లో దాదాపు కోటి మంది ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించారు. గతేడాదితో పోల్చితే ఈసారి 10 లక్షల మంది ప్రయాణికులు రైళ్ల సేవలను వినియోగించుకున్నారు.
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సాధారణ రోజుల్లో 1.3 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకేరోజు 2 లక్షల మందికి పైగా ప్రయాణించి రికార్డు సృష్టించారు. కాచిగూడ స్టేషన్ నుంచి ఒకేరోజు 68,500 మంది ప్రయాణించారు. సాధారణ రోజుల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యకు ఇది రెట్టింపు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






