Indian Railways | రైల్వేలో 30 వేల ఉద్యోగాల కోత.. దక్షిణ మధ్య రైల్వేలో ఎన్నంటే?
Indian Railways | ఇన్నాళ్లు ప్రైవేటు కంపెనీలు, సాఫ్ట్ రంగానికే పరిమితమైన ఉద్యోగాల కోత.. ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థలకూ పాకింది. నిర్వహణ వ్యయాన్ని సాకుగా చూపి పనితీరు ఆధారంగా ఉద్యోగాలను రద్దు చేయాలంటూ వివిధ శాఖలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
Indian Railways | త్రినేత్ర.న్యూస్: ఇన్నాళ్లు ప్రైవేటు కంపెనీలు, సాఫ్ట్ రంగానికే పరిమితమైన ఉద్యోగాల కోత.. ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థలకూ పాకింది. నిర్వహణ వ్యయాన్ని సాకుగా చూపి పనితీరు ఆధారంగా ఉద్యోగాలను రద్దు చేయాలంటూ వివిధ శాఖలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఉద్యోగాల కోతకు రైల్వే శాఖ (Indian Railways) సిద్ధమవుతున్నది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 29,608 పోస్టులను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రతి జోన్‌కు ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించింది. పనితీరు ఆధారంగా సిబ్బందిని సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది. 2026, ఏప్రిల్ 1 నాటికి మంజూరైన పోస్టుల్లో ఈ కోత అమలు చేయాలని అన్ని జోన్ల జనరల్ మేనేజర్‌లకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. రద్దు చేసిన పోస్టుల్లో ప్రస్తుతం ఖాళీగా, ఉద్యోగులు ఉన్న పోస్టులూ ఉన్నాయి. ఇలా రద్దయ్యే పోస్టుల్లో ఎక్కువ క్లరికల్ విభాగం, మెయింటెనెన్స్ విభాగం పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టుల్లో ఉన్న వారిని ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేయనున్నారు.
నిర్వహణ వ్యయం సాకుగా..
నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి పోస్టులు రద్దు చేయాలని రైల్వేశాఖ గతేడాది నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి 2 శాతం పోస్టులు సరెండర్, సర్దుబాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం రైల్వే శాఖలో మంజూరైన పోస్టుల్లో దేశవ్యాప్తంగా 3.5లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఏటా 2 శాతం పోస్టుల చొప్పున రద్దు చేస్తారు. ఇకపై కొత్త పోస్టులను మంజూరు చేయరు.
ఎస్‌సీఆర్‌లో
రేషనలైజేషన్‌లో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలో (SCR) 1908 పోస్టులు రద్దు కానున్నాయి. ఈ మేరకు రైల్వే బోర్టు ఏప్రిల్ 24న ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఎస్‌సీఆర్ పరిధిలో 95,402 పోస్టులు ఉన్నాయి. పోస్టులు అత్యధికంగా తగ్గనున్న జోన్లలో ఎస్‌సీఆర్ ఆరో స్థానంలో ఉన్నది. అత్యధికంగా నార్తర్న్ రైల్వేలో 3,303 పోస్టులు తగ్గనున్నాయి. ఇక ఈస్టర్న్ రైల్వేలో 2,544, సెంట్రల్ రైల్వే 2,492, వెస్టర్న్ రైల్వే 2,339, సౌత్ ఈస్టర్న్ రైల్వే 1,967, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,922 ఉగ్యాల కోత విధించనున్నారు. కాగా, ప్రస్తుతం రైల్వే శాఖలో దేశవ్యాప్తంగా 14.8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
సంబంధిత వార్తలు

Train Accidents | రైళ్లలో వరుస అగ్నిప్రమాదాల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం : రైల్వే శాఖ
మే 20, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026

Train | రైలు మిస్ అయితే ఇంకో రైలులో అదే టిక్కెట్‌తో వెళ్లవచ్చా.. రూల్స్ ఏం చెబుతున్నాయి..?
మే 2, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



