Delhi High Court | నిరసనల నియంత్రణకు ఎస్‌ఓపీలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..
Delhi High Court | న్యూఢిల్లీ: నిరసన ప్రదర్శనలను నియంత్రించేందుకు ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్‌ఓపీలు) రూపొందించి అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం అంగీకరించింది. ఇటీవలి కాలంలో నిరసన ప్రదర్శనల కారణంగా సుమారు రూ.2వేల కోట్ల మేర నష్టాలు వాటిల్లాయని వ్యాపారుల సంఘం పేర్కొంది.
Delhi High Court | న్యూఢిల్లీ: నిరసన ప్రదర్శనలను నియంత్రించేందుకు ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్‌ఓపీలు) రూపొందించి అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం అంగీకరించింది. ఇటీవలి కాలంలో నిరసన ప్రదర్శనల కారణంగా సుమారు రూ.2వేల కోట్ల మేర నష్టాలు వాటిల్లాయని వ్యాపారుల సంఘం పేర్కొంది. సీనియర్ న్యాయవాది సచ్చిన్ పురి ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించి, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. నిరసన ప్రదర్శనలను నియంత్రించడంతోపాటు వ్యాపార కార్యకలాపాలు, న్యాయస్థానాల సాధారణ పనితీరుకు ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు పిటిషన్లు దాఖలయ్యాయని ఆయన తెలిపారు. వీటిలో ఒకటి న్యాయవాది, మరొకటి వ్యాపారుల సంఘం దాఖలు చేసినట్లు వివరించారు.
ఇటీవలి కాలంలో ఈ పరిణామాల కారణంగా రూ.2వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, ఎస్‌ఓపీలను అమలు చేయాలని తాము కోరుతున్నామని తెలిపారు. న్యాయవాదులు, వ్యాపారుల కార్యకలాపాలకు అంతరాయం కలగని విధంగా నిరసనలను నిర్వహించాలని, కన్నాట్ ప్లేస్ వంటి ప్రాంతాలకు కూడా పూర్తిగా చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందని కోర్టుకు తెలిపారు. నిరసన ప్రదర్శనల సమయంలో ప్రజల రాకపోకలకు, వాణిజ్య ప్రాంతాలకు చేరుకునేందుకు ఎలాంటి అనవసర ఆటంకాలు కలగకుండా చూడడంతోపాటు, న్యాయస్థానాల సాధారణ కార్యకలాపాలు సజావుగా సాగేలా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని పిటిషన్లలో కోరారు.
సంబంధిత వార్తలు

No relief for PepsiCo | పెప్సీకోకు హైకోర్టులో దక్కని ఊరట.. కొత్త ఉత్పత్తులపై ఆంక్షలు యథాతథం
అక్టోబర్ 12, 2026

Vijay-Kangana | ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విజయ్ దేవరకొండ, కంగనా.. అసలు ఏం జరిగిందంటే..?
అక్టోబర్ 8, 2026

Vinesh Phogat | వినేశ్ ఫొగాట్‌కు ఎదురుదెబ్బ.. ట్రయల్స్‌కు హైకోర్టు నో!
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గజగజ వణికిపోతుండు
- ●Pooja Hegde | బుట్టబొమ్మ బర్త్‌డే ట్రీట్ - అచ్చ తెలుగు అమ్మాయిగా పూజా హెగ్డే
- ●Godrej Consumer Products | వినియోగదారులకు షాకిచ్చిన గోద్రెజ్.. కన్స్యూమర్ ఉత్పత్తుల ధరలు పెంపు..
- ●Giriraj Singh | 9 రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు: గిరిరాజ్ సింగ్
- ●Gold And Silver Prices Today | ప్రపంచ బులియన్ మార్కెట్లలో జోరు.. ఈక్విటీ మార్కెట్లలో లాభాల ఎఫెక్ట్..
- ●OnePlus 16 | వన్‌ప్లస్ 16 వచ్చేసింది.. 185 హెడ్జ్ డిస్ప్లే, 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ..

Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గజగజ వణికిపోతుండు

Pooja Hegde | బుట్టబొమ్మ బర్త్‌డే ట్రీట్ - అచ్చ తెలుగు అమ్మాయిగా పూజా హెగ్డే

Godrej Consumer Products | వినియోగదారులకు షాకిచ్చిన గోద్రెజ్.. కన్స్యూమర్ ఉత్పత్తుల ధరలు పెంపు..

Giriraj Singh | 9 రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు: గిరిరాజ్ సింగ్



