OnePlus 16 | వన్‌ప్లస్ 16 వచ్చేసింది.. 185 హెడ్జ్ డిస్‌ప్లే, 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ..
OnePlus 16 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 16ను అధికారికంగా ప్రకటించింది. మొబైల్ గేమింగ్, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మెరుగైన పనితీరు, ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించింది. ఇందులో 185 హెడ్జ్ వరకు గేమింగ్ రిఫ్రెష్ రేట్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి.
Technology | Published On Oct 13, 2026, 11.02 am IST
OnePlus 16 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 16ను అధికారికంగా ప్రకటించింది. మొబైల్ గేమింగ్, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మెరుగైన పనితీరు, ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించింది. ఇందులో 185 హెడ్జ్ వరకు గేమింగ్ రిఫ్రెష్ రేట్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి. వన్‌ప్లస్ 16ను నాలుగు వైపులా సమానమైన 1.15 మిల్లీమీటర్ల అంచులతో రూపొందించారు. స్టార్‌లైట్, డార్క్ ఫారెస్ట్, మార్షియన్ మాస్టర్‌పీస్ అనే మూడు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. స్టార్‌లైట్ వేరియంట్‌లో సిల్క్ గ్లాస్ తయారీ సాంకేతికతతోపాటు ప్రత్యేక బ్రీతింగ్ లైట్ ఇండికేటర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో నాలుగో తరం ఓరియంటల్ స్క్రీన్‌ను పరిచయం చేశారు. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్4 ల్యూమినసెంట్ మెటీరియల్‌ను ఉపయోగించారు.
185 హెడ్జ్ డిస్‌ప్లే..
సాధారణ వినియోగంలో గరిష్ఠంగా 165 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను, గేమింగ్ సమయంలో పరిశ్రమలో తొలిసారిగా 185 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఈ డిస్‌ప్లే అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందుకోసం ఎల్‌టీపీఓ సర్క్యూట్‌ను పునఃరూపకల్పన చేశారు. డిస్‌ప్లే ప్రకాశాన్ని కనిష్ఠంగా ఒక నిట్ వరకు తగ్గించుకునే హార్డ్‌వేర్ సదుపాయం ఇందులో ఉంది. అధిక వెలుతురు ఉన్న ప్రాంతాల్లోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా సన్‌లైట్ మోడ్‌ను అందించారు. రంగులు సహజంగా, కచ్చితంగా కనిపించేందుకు మూడు దశల్లో కలర్ కాలిబ్రేషన్ చేశారు. వన్‌ప్లస్ 16లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. 2 నానోమీటర్ల తయారీ ప్రక్రియతో రూపొందించిన ఈ చిప్‌సెట్ గత బెంచ్‌మార్క్‌లతో పోలిస్తే 13 శాతం అధిక సీపీయూ పనితీరును, 44 శాతం మెరుగైన జీపీయూ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది. మొత్తం విద్యుత్ సామర్థ్యం 10 శాతం మెరుగుపడడంతోపాటు, నిరంతర పనితీరు సామర్థ్యం గత బెంచ్‌మార్క్‌లతో పోలిస్తే రెట్టింపుగా ఉంటుందని పేర్కొంది.
ప్రత్యేక చిప్ వ్యవస్థలు..
ప్రధాన ప్రాసెసర్‌కు తోడుగా ప్రత్యేక ఈ-స్పోర్ట్స్ ట్రిపుల్ చిప్ వ్యవస్థను అందించారు. ఇందులో నెట్‌వర్క్ ఆలస్యాన్ని తగ్గించే జీ3 చిప్, కదలికలను స్పష్టంగా చూపించే పీ4 సూపర్ డిస్‌ప్లే చిప్, టచ్ స్పందనను మెరుగుపరిచే టీ3 టచ్ చిప్ ఉన్నాయి. గ్రాఫిక్స్ రెండరింగ్ కోసం విండ్ ఛేజర్ గేమ్ కెర్నల్‌ను ఉపయోగించారు. ఇది మల్టీ-ఫ్రేమ్ జనరేషన్ సామర్థ్యాలను అందిస్తుంది. ఫోన్ వేడెక్కకుండా నియంత్రించేందుకు గ్లేసియర్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులోని జోన్డ్ యాక్సిలరేషన్ డిజైన్ థర్మల్ జెల్ సామర్థ్యాన్ని 50 శాతం పెంచుతుందని కంపెనీ వెల్లడించింది. షూటింగ్ గేమ్‌లలో లక్ష్యాన్ని కచ్చితంగా గురిపెట్టడం, ఆయుధాల రీకాయిల్‌ను నియంత్రించడం కోసం హైప్రెసిషన్ గైరోస్కోప్‌ను కూడా అందించారు.

భారీ బ్యాటరీ..
వన్‌ప్లస్ 16లోని 185 హెడ్జ్ డిస్‌ప్లే ప్రారంభం నుంచే పలు ప్రముఖ గేమ్‌లలో అధిక ఫ్రేమ్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. పబ్‌జీ మొబైల్, డెల్టా ఫోర్స్, వాలరెంట్: ఎనర్జీ ఆపరేషన్, డార్క్ జోన్, క్రాస్‌ఫైర్: మొబైల్, నరుటో, ఫైర్‌ఫ్లై అసాల్ట్ వంటి గేమ్‌లు ఇందులో ఉన్నాయి. హానర్ ఆఫ్ కింగ్స్ గేమ్‌లో అల్ట్రా-హై గ్రాఫిక్స్‌తో 165 ఎఫ్‌పీఎస్‌కు మించిన గేమ్‌ప్లేకు కూడా ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది. భవిష్యత్తులో మైన్‌క్రాఫ్ట్, క్లాష్ ఆఫ్ క్లాన్స్ వంటి గేమ్‌లకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. వన్‌ప్లస్ చరిత్రలోనే అత్యధిక సామర్థ్యం కలిగిన 9,000 ఎంఏహెచ్ గ్లేసియర్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చారు. ఇందులో 100 వాట్ల సూపర్‌వూక్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్, 27 వాట్ల రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచి ఉపయోగించే సందర్భాల్లో పనితీరు స్థిరంగా ఉండేందుకు ఫుల్ సీనారియో బైపాస్ ఛార్జింగ్‌ను అందించారు. తక్కువ బ్యాటరీ స్థాయిలోనూ పనితీరు మెరుగ్గా ఉండేందుకు ఒప్పో ఎనర్జీ కాన్సంట్రేషన్ చిప్‌ను ఉపయోగించారు.
200 మెగాపిక్సల్ కెమెరా..
ఈ ఫోన్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, రెండు వైపులా సమానమైన డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, ఎక్స్-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్, ట్రై-బ్యాండ్ జీపీఎస్, ఎన్79 సెల్యులార్ ఫ్రీక్వెన్సీ సపోర్ట్ ఉన్నాయి. దుమ్ము, నీటి నిరోధకత కోసం ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కె రేటింగ్‌లను కూడా అందించారు. ఫొటోగ్రఫీ కోసం ఎల్‌యూఎంఓ లైట్ అండ్ షాడో ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇందులో ఎఫ్/1.6 అపెర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 200 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాను అందించారు. ఈ సెన్సార్ ఆప్టికల్ ఫార్మాట్ 1/1.4 ఇంచులు. అలాగే 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50 మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా, 116 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో కూడిన 50 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. పెరిస్కోప్ కెమెరా సెన్సార్ ఫార్మాట్ 1/1.95 ఇంచులు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఆటోఫోకస్‌తో కూడిన 50 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
8కె వీడియో రికార్డింగ్..
వీడియో రికార్డింగ్‌లో భాగంగా 4కె రిజల్యూషన్‌లో సెకనుకు 120 ఫ్రేమ్‌లతో డాల్బీ విజన్ వీడియోలను, గరిష్ఠంగా 8కె వీడియోలను రికార్డు చేయవచ్చు. ఫ్రంట్ కెమెరాతో 4కె రిజల్యూషన్‌లో సెకనుకు 60 ఫ్రేమ్‌ల వరకు వీడియో రికార్డింగ్ సాధ్యమవుతుంది. వన్‌ప్లస్ 16 కలర్‌ఓఎస్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో కొత్త ఫ్లూయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్‌ను అందించారు. యాపిల్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానమయ్యే సదుపాయాన్ని కూడా చేర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లలో తరగతి గది నోట్స్‌ను ఆటోమేటిక్‌గా క్రమబద్ధీకరించడం, ఫార్ములాలను అనువదించడం, విద్యాపరమైన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడే సాధనాలు ఉన్నాయి.

పవర్‌ఫుల్ డిస్‌ప్లే..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 ఇంచుల 1.5కె ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. దీని రిజల్యూషన్ 2772 * 1272 పిక్సల్స్. సాధారణ వినియోగంలో 1 నుంచి 165 హెడ్జ్ వరకు ఇంటెలిజెంట్ రిఫ్రెష్ రేట్ మార్పులు, గేమింగ్‌లో 185 హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. సాధారణ ప్రకాశం గరిష్ఠంగా 1,000 నిట్స్, పీక్ బ్రైట్‌నెస్ 2,000 నిట్స్ వరకు ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 ఆక్టాకోర్ 2ఎన్‌ఎం మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో పాటు అడ్రినో 850 జీపీయూను అందించారు. 12 జీబీ లేదా 16 జీబీ ర్యామ్ వేరియంట్లు ఉన్నాయి. 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ ఎంపికలు లభిస్తాయి. ఇందులో రెండు నానో సిమ్‌లను ఉపయోగించవచ్చు. వెనుక కెమెరాల్లో 200 మెగాపిక్సల్ ప్రధాన సెన్సార్‌కు ఎఫ్/1.6 అపెర్చర్, ఓఐఎస్ సపోర్ట్ ఉన్నాయి. 50 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరాకు ఎఫ్/2.0 అపెర్చర్, 50 మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాకు ఎఫ్/2.6 అపెర్చర్, ఓఐఎస్ సదుపాయాలు ఉన్నాయి. ముందు కెమెరాలో 50 మెగాపిక్సల్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్, ఆటోఫోకస్ ఉన్నాయి.
ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5జి ఎస్‌ఏ, ఎన్‌ఎస్‌ఏ, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 7 (802.11బీఈ), బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్ ఉన్నాయి. నావిగేషన్ కోసం బీడౌ (బీ1ఐ, బీ1సీ, బీ2ఏ), జీపీఎస్ (ఎల్1, ఎల్5), గ్లోనాస్ (జీ1), గెలీలియో (ఈ1, ఈ5ఏ), క్యుజెడ్‌ఎస్‌ఎస్ (ఎల్1, ఎల్5) సపోర్ట్ అందించారు. యూఎస్‌బీ టైప్ సి 3.2 జెన్ 1 పోర్ట్‌ను ఉపయోగించారు.

ధర వివరాలు..
వన్‌ప్లస్ 16 ధర చైనాలో 5,999 యువాన్ల నుంచి ప్రారంభమవుతుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,999 యువాన్లు. ఇది సుమారు 896 అమెరికన్ డాలర్లు లేదా రూ.85,850కు సమానం. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,799 యువాన్లు. ఇది సుమారు 1,015 అమెరికన్ డాలర్లు లేదా రూ.97,300కు సమానం. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 7,499 యువాన్లు కాగా సుమారు 1,120 అమెరికన్ డాలర్లు లేదా రూ.1,07,315గా ఉంటుంది. ఇక 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,499 యువాన్లు. ఇది సుమారు 1,270 అమెరికన్ డాలర్లు లేదా రూ.1,21,625కు సమానం. ఈ ఫోన్‌కు చైనాలో ఇప్పటికే ఆర్డర్లు స్వీకరిస్తున్నారు. మంగళవారం నుంచి విక్రయాలు ప్రారంభం అయ్యాయి. తొలి విక్రయాల సందర్భంగా 300 యువాన్ల తగ్గింపును ప్రకటించారు.
ప్రారంభ విక్రయాల సమయంలో ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు 299 యువాన్ల విలువైన ఒప్పో ఎన్‌కో ఆర్5 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లు, 199 యువాన్ల విలువైన వన్‌ప్లస్ మాగ్నెటిక్ ఐస్ కార్డ్ మినీని ఉచితంగా అందించనున్నారు. విద్యార్థులకు పరిమిత కాలం పాటు 199 యువాన్ల విలువైన క్విల్టెడ్ బ్యాక్‌ప్యాక్‌ను కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. అయితే ఈ ఫోన్‌ను ప్రపంచ దేశాల మార్కెట్లలో ఎప్పుడు విడుదల చేసేదీ వన్‌ప్లస్ వివరాలను వెల్లడించలేదు. కానీ భారత్‌లో మాత్రం అతి త్వరలోనే ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 250 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..
- ●Jalamandali | నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయి..! జలమండలి క్లారిటీ..!!
- ●Vijay Devarakonda | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్, రష్మిక దంపతులు
- ●Mimicry Artist Satyanarayana | ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సత్యనారాయణ మృతి
- ●TGRPDCL | తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు
- ●Navaratri Brahmotsavam | శతాబ్దాల సంప్రదాయం.. శ్రీనివాసుడికి నిత్యకల్యాణ వేడుక

Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 250 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..

Jalamandali | నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయి..! జలమండలి క్లారిటీ..!!

Vijay Devarakonda | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్, రష్మిక దంపతులు

Mimicry Artist Satyanarayana | ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సత్యనారాయణ మృతి



