త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

No relief for PepsiCo | పెప్సీకోకు హైకోర్టులో ద‌క్క‌ని ఊర‌ట‌.. కొత్త ఉత్పత్తులపై ఆంక్షలు యథాతథం

No relief for PepsiCo | ‘ఎనర్జీ డ్రింక్‌’ లేబుల్‌తో కొత్త ఉత్పత్తుల తయారీకి అనుమతికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో పెప్సీకోకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు స్పష్టమైన కారణాలు నమోదు చేయాలని సింగిల్‌ జడ్జిని ఆదేశించింది.

P

National | Published On Oct 12, 2026, 7.50 pm IST

No relief for PepsiCo | పెప్సీకోకు హైకోర్టులో ద‌క్క‌ని ఊర‌ట‌.. కొత్త ఉత్పత్తులపై ఆంక్షలు యథాతథం
Advertisement

No relief for PepsiCo | ‘ఎనర్జీ డ్రింక్‌’ లేబుల్‌తో కొత్త ఉత్పత్తుల తయారీకి అనుమతికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో పెప్సీకోకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు స్పష్టమైన కారణాలు నమోదు చేయాలని సింగిల్‌ జడ్జిని ఆదేశించింది. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ నితిన్‌ వాసుదేవ్‌ సాంబ్రే, జస్టిస్‌ సంజయ్‌ శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం పెప్సీకో దాఖలు చేసిన అప్పీలుపై విచారణ చేపట్టింది. అక్టోబర్‌ 6న సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టమైన కారణాలు లేవని ప్రాథమికంగా అభిప్రాయపడింది. రెడ్‌బుల్‌ కేసులో అనుమతి ఇచ్చినప్పుడు.. పెప్సీకోకు ఎందుకు నిరాకరించారో వివరించాలని సూచించింది.

కొత్త ఉత్పత్తుల తయారీకి అనుమతి నో

పెప్సీకోకు చెందిన ‘స్టింగ్‌ ఎనర్జీ’, ‘అడ్రినలిన్‌ రష్‌’ పానీయాలపై ‘ఎనర్జీ డ్రింక్‌’ లేబుల్‌ తొలగించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తయారైన నిల్వలను విక్రయించేందుకు కోర్టు అనుమతించినా, అదే లేబుల్‌తో కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి అనుమతించలేదు. ఈ ఆంక్షలను సవాల్‌ చేస్తూ పెప్సీకో హైకోర్టును ఆశ్రయించింది. కేసు మెరిట్స్‌పై ప్రస్తుతం తాము నిర్ణయం తీసుకోబోమని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులపై సింగిల్‌ జడ్జి ముందు విచారణ పెండింగ్‌లో ఉందని పేర్కొంది. ప్రస్తుతానికి మధ్యంతర రక్షణ అమల్లోనే ఉంటుందని తెలిపింది. ఫ‌సాయ్ తరఫు న్యాయవాది అప్పీలును వ్యతిరేకిస్తూ, అది విచారణకు అర్హమైనది కాదని వాదించారు. కాగా, ఎనర్జీ డ్రింక్‌ లేబుల్‌తో ఉన్న ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవాలని ఆహార భద్రత అధికారులకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గతంలో ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement