త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sabarimala Gold Case | శ‌బ‌రిమ‌ల బంగారు తాపడాల కేసులో కీల‌క ప‌రిణామం.. ప్ర‌ధాన పూజారిని అరెస్ట్ చేసిన సిట్‌

Sabarimala Gold Case | శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యం బంగారు తాప‌డాల కేసులో శుక్ర‌వారం కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న‌ది. ఆల‌య తంత్రి (ప్ర‌ధాన అర్చ‌కుడు) కందారు రాజీవ‌రుని ప్ర‌త్యేక ద‌ర్యాపు బృందం ఆయ‌న‌ను అదుపులోకి తీసుకొని విచారించింది.

P

National | Published On Jan 9, 2026, 4.16 pm IST

Sabarimala Gold Case | శ‌బ‌రిమ‌ల బంగారు తాపడాల కేసులో కీల‌క ప‌రిణామం.. ప్ర‌ధాన పూజారిని అరెస్ట్ చేసిన సిట్‌
Advertisement

Sabarimala Gold Case | శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యం బంగారు తాప‌డాల కేసులో శుక్ర‌వారం కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న‌ది. ఆల‌య తంత్రి (ప్ర‌ధాన అర్చ‌కుడు) కందారు రాజీవ‌రుని ప్ర‌త్యేక ద‌ర్యాపు బృందం ఆయ‌న‌ను అదుపులోకి తీసుకొని విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్‌ పొట్టితో స‌న్నిహిత సంబంధాలు ఉన్న‌ట్లుగా గుర్తించారు. బంగారం తాప‌డాల చోరీ వ్య‌వ‌హారంలో ఆయ‌న పాత్ర ఉన్న‌ట్లుగా తేలింది. దాంతో అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే, ఉన్ని కృష్ణన్ పొట్టిని శబరిమలకు తీసుకువచ్చింది సైతం ప్ర‌ధాన అర్చ‌కుడైన రాజీవరేనని ఇతర నిందితులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బంగారు తాపడాల దొంగతనం గురించి ఆయనకు ముందే తెలుసని ఆరోపించారు.

శబరిమల అయ్యప్ప ఆలయ బంగారు తాప‌డాలకు సంబంధించిన చోరీ కేసుపై కేర‌ళ హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచార‌ణ జ‌రుపుతున్న‌ది. ఈ కేసులో తంత్రి రాజీవ‌రును శుక్ర‌వారం వేకువ జామున అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న‌ను తిరువ‌నంత‌పురంలోని ఇంచ‌క్క‌ల్‌లోని కేర‌ళ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ప్ర‌ధాన కార్యాల‌యానికి తీసుకువ‌చ్చారు. గ‌తంలోనూ తంత్రిని విచారించిన విష‌యం తెలిసిందే. గ‌తంలో తంత్రి సిట్ విచారించింది. ఇటీవ‌ల విచార‌ణ‌కు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయ‌గా హాజ‌రుకాలేదు. ప‌లుసార్లు స‌మ‌న్లు జారీ చేసిన రాక‌పోవ‌డంతో చివ‌ర‌కు అదుపులోకి తీసుకొని విచారించింది. అనంత‌రం అరెస్టు చేసింది. క‌స్ట‌డీలోకి తీసుకొని విచారించినందుకు అరెస్టు చేసిన‌ట్లుగా అధికారులు పేర్కొన్నారు.

2000వ ద‌శ‌కం ప్రారంభంలో ఉన్నికృష్ణన్‌ పొట్టి శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో ఓ దిగువ స్థాయి పూజారికి స‌హాయ‌కుడిగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత ట్రావెన్ కోర్ దేవ‌స్వం బోర్డు ప‌రిపాల‌న‌, ప్ర‌స్తుత తంత్రి నేతృత్వంలోని ఆల‌య సంప్ర‌దాయ పూజారుల వ‌ర్గం ప‌లుకుబ‌డి సంపాదించిన‌ట్లుగా ఆరోప‌ణలున్నాయి. ఉన్ని కృష్ణ‌న్ ఏళ్లుగా ఆల‌యానికి విరివిగా విరాళాలు, ఖ‌రీదైన పూజ‌ల‌ను స్పాన్స‌ర్ చేసే, భారీగా ఖ‌ర్చుల‌ను భ‌ర్తించే ఉన్న‌త వ‌ర్గాల‌కు చెందిన అయ్య‌ప్ప భ‌క్తుల‌తో నెట్‌వ‌ర్క్‌ను పెంచుకున్న‌ట్లుగా అధికారులు పేర్కొన్నారు. వీఐపీలు, ముఖ్యంగా సినీతాత‌ర‌లు, ప్ర‌ముఖుల‌ను ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు, పూజ‌ల కోసం ఆల‌యానికి తీసుకువెళ్ల‌డంతో స‌హా ఉన్ని కృష్ణ‌న్‌కు తంత్రి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యానికి సంబంధించిన ఆధారాల‌ను సిట్ సంపాదించిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా.. ఈ కేసులో ఇద్ద‌రు మాజీ దేవ‌స్వం బోర్డు అధ్య‌క్షులు, ఆల‌య అధికారులు స‌హా 11 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. బంగారం అవ‌క‌త‌వ‌క‌ల కేసును ఈడీ సైతం విచారించ‌నున్న‌ది. కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తితో ఈడీ కొచ్చి యూనిట్ మ‌నీలాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం కింద కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ని నమోదు చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement