Well | ఆ బావి గత 80 ఏండ్లలో ఒక్కసారీ ఎండిపోలే..
Well | ఆ బావిని (Well) 80 ఏండ్ల క్రితం తవ్వారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందులో నీరు ఒక్కసారి కూడా ఎండిపోలేదు. తవ్వినప్పుడు తప్ప ఆ బావి అడుగును చూసినవారూ లేరు.!
Well | త్రినేత్ర.న్యూస్: ఆ బావిని (Well) 80 ఏండ్ల క్రితం తవ్వారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందులో నీరు ఒక్కసారి కూడా ఎండిపోలేదు. తవ్వినప్పుడు తప్ప ఆ బావి అడుగును చూసినవారూ లేరు.! ఎర్రటి ఎండల్లోనూ జీవధారను అందిస్తున్నది. ఆ చుట్టుపక్కల గ్రామాలకు 8 దశాబ్దాలుగా ఆధారమైన బావి నల్లగొండ (Nalgonda) జిల్లా త్రిపురారం మండలం సత్యంపాడుతండాలో ఉన్నది.
ఇస్లావత్ తీక్యానాయక్ అనే వ్యక్తి 80 ఏండ్ల క్రితం ఈ బావిని తవ్వించారు. దానికి 20 ఇండ్ల వారు మోటార్లను అమర్చి నీటిని వినియోగిస్తున్నారు. ఎంత కరవు వచ్చినా బావిలో నీరు ఎండిపోలేదని, నిత్యం నీళ్లు వస్తూనే ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
దూప తీరుస్తున్న బావులు..
ఇలా స్థానికులకు దూప తీరుస్తున్న ఇలాంటి బావులే అల్వాలపాడుతండా, లక్పతితండాల్లోనూ ఉన్నాయి. 70 ఏండ్ల క్రితం తవ్వించిన బావులకూ 10-15 మోటార్లను అమర్చి నీటిని వాడుకుంటున్నారు. రాగడప పంచాయతీ పరిధిలోని పలుగుతండా, లచ్యతండా, కాపువారిగూడెం, బడాయిగడ్డ, డొంకతండా, మీట్యతండాల్లోనూ అప్పటి సర్పంచి రేవూరి సైదయ్య తవ్వించిన చేద బావులు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.

ఆ ఊరు పేరే బోరింగుగూడ..
ఆదిలాబాద్ జిల్లా గిరిజన గ్రామమైన బోరింగుగూడలోనూ (Boringguda) ఇదే తరహా బోరింగు పంపు ఉన్నది. ఆ చేతి పంపును ఎవరూ కొట్టకుండానే, ఎలాంటి మోటారు బిగించకుండానే నిత్యం నీరు ఉబికి వస్తూనే ఉన్నాయి. ఇలా 50 ఏండ్లుగా ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఆ బోరింగు పోస్తూనే (అర్టీసియన్ బావి) ఉన్నది. దీంతో ఆ గ్రామానికి బోరింగుగూడా అనే పేరు స్థిరపడిపోయింది. ఇక్కడ కోలాం తెగకు చెందిన గిరిజనులు ఉంటారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Inter Advanced Results | 11.30కి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు..
- ●Donald Trump | ప్రధానిగా మోదీ.. భారతదేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం: డొనాల్డ్ ట్రంప్
- ●ZPHS Indira Nagar | ఆ సర్కారు బడిలో సీటు కావాలంటే పోటీ పరీక్ష రాయాల్సిందే..
- ●Horoscope | జూన్ 11 రాశిఫలాలు.. ఈ రాశివారు వృత్తిపరంగా గొప్ప లాభాలను పొందుతారు!
- ●Bhatti Vikramarka | జపాన్, కొరియా వంటి దేశాలతో పోటీ పడుతున్నాం : భట్టి విక్రమార్క
- ●CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే.. ప్రజలు బండకేసి కొడుతారు : సీఎం రేవంత్ రెడ్డి

Inter Advanced Results | 11.30కి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు..

Donald Trump | ప్రధానిగా మోదీ.. భారతదేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం: డొనాల్డ్ ట్రంప్

ZPHS Indira Nagar | ఆ సర్కారు బడిలో సీటు కావాలంటే పోటీ పరీక్ష రాయాల్సిందే..

Horoscope | జూన్ 11 రాశిఫలాలు.. ఈ రాశివారు వృత్తిపరంగా గొప్ప లాభాలను పొందుతారు!






