త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ricky Syngkon | ఫుట్‌బాల్ ఆడుతూ కుప్ప‌కూలిన ఎంపీ..

Ricky Syngkon | జీవితం క్ష‌ణ భంగురం అంటారు. మ‌నుషుల‌కు ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇప్పుడు క‌నిపించిన వ్య‌క్తి మ‌ళ్లీ ఓ గంట త‌ర్వాత స‌జీవింగా క‌నిపిస్తాడో లేడో కూడా చెప్ప‌లేం. ఇలాంటి ఘ‌ట‌నే మేఘాల‌య (Meghalaya) రాజ‌ధాని షిల్లాంగ్‌లో (Shillong) చోటుచేసుకున్న‌ది.

G

National | Published On Feb 20, 2026, 6.15 am IST

Ricky Syngkon | ఫుట్‌బాల్ ఆడుతూ కుప్ప‌కూలిన ఎంపీ..
Advertisement

Ricky Syngkon | త్రినేత్ర‌.న్యూస్‌: జీవితం క్ష‌ణ భంగురం అంటారు. మ‌నుషుల‌కు ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇప్పుడు క‌నిపించిన వ్య‌క్తి మ‌ళ్లీ ఓ గంట త‌ర్వాత స‌జీవింగా క‌నిపిస్తాడో లేడో కూడా చెప్ప‌లేం. ఇలాంటి ఘ‌ట‌నే మేఘాల‌య (Meghalaya) రాజ‌ధాని షిల్లాంగ్‌లో (Shillong) చోటుచేసుకున్న‌ది. రోజూలానే ఫుట్‌బాల్ ఆడుతున్న ఓ ప్ర‌జాప్ర‌తినిధి అంతా చూస్తుండ‌గ‌నే కుప్ప‌కూలిపోయాడు.

షిల్లాంగ్ ఎంపీ, వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీ (VPP) ఉపాధ్య‌క్షుడు రికీ సింగ్‌కాన్ (Ricky Syngkon) మ‌ర‌ణించారు. గురువారం సాయంత్రం షిల్లాంగ్ స‌మీపంలోని మావులాయి మావి యంగ్ అనే ప్రాంతంలోని గ్రౌండ్‌లో తన స్నేహితులతో కలిసి ఫుట్ బాల్ (Football) ఆడేందుకు వెళ్లారు. మ్యాచ్ ఆడుతుండ‌గా ఒక్క‌సారిగా గ్రౌండ్‌లోనే కుప్ప‌కూలిపోయారు. దీంతో ఆయ‌న‌ను హుటాహుటిన ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే అక్క‌డ సంబంధిత‌ డాక్ట‌ర్ లేక‌పోవ‌డంతో మెరుగైన చికిత్స కోసం జైవాలోని మ‌రో హాస్పిట‌ల్‌కి తీసుకెళ్లారు.

కానీ అక్కడ చికిత్స ప్రారంభించిన కొద్దిసేప‌టికే ఆయ‌న‌ మరణించారు. త‌మ మెడిక‌ల్ టీమ్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేద‌ని, రాత్రి 8.42 గంట‌ల‌కు రికీ తుది శ్వాస విడిచార‌ని వైద్దులు వెల్ల‌డించారు. అనుకోకుండా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో ఆయ‌న స‌హ‌చ‌రులు, స్నేహితులు దిగ్భ్రాంతికి గుర‌య్యారు. ఎంపీ ఆక‌స్మిక మృతితో షిల్లాంగ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

రికీ మృతిప‌ట్ల మేఘాల‌యా ముఖ్య‌మంత్రి క‌న్రాడ్ సంగ్మా, ఉప‌ముఖ్య‌మంత్రి ప్రెస్ట‌న్ టిన్‌సాంగ్‌, వీపీపీ అధ్య‌క్షుడు ఆర్డెంట్ మిల్ల‌ర్ బ‌స‌య్యామోయిట్‌, ప‌లువ‌రు రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తంచేశారు. కాగా, రికీ సింగ్‌కాన్‌ షిల్లాంగ్ ఎంపీగా తొలిసారి ఎన్నికయ్యారు.

 

Advertisement
Advertisement