Shashi Tharoor | నా పార్టీ కాంగ్రెస్సే.. వీడేది లేదు : శశి థరూర్
Shashi Tharoor | తాను కాంగ్రెస్ పార్టీని వీడబోవడం లేదని ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, యూడీఎఫ్ గెలవాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం తాను ప్రచారం చేస్తానన్నారు.
Shashi Tharoor | తాను కాంగ్రెస్ పార్టీని వీడబోవడం లేదని ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, యూడీఎఫ్ గెలవాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం తాను ప్రచారం చేస్తానన్నారు. ఇటీవల కొద్దిరోజులుగా ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారని, విభేదాలున్నాయన్న వార్తల మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ, యూడీఎఫ్ గెలుపు చూడాలని అనుకుంటున్నానన్నారు. పార్టీ, కూటమి విజయం కోసం తనవంతు ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. తనకు ఒకే ఒక పార్టీ ఉందని.. అది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఇకపై దానిపై పదే పదే ప్రశ్నలు అడగొద్దన్నారు. తాను కాంగ్రెస్‌లో ఉంటానని.. వీడబోవడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నేత ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలను కలిశారు. కేరళ కాంగ్రెస్‌లో ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం వార్తలున్నాయి. కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో పార్టీ వ్యవహరించిన తీరుతో ఆయన కొంత ఇబ్బందిపడ్డారు. అధిష్టానంతో మాట్లాడిన తర్వాత అంతా బాగానే ఉందని.. తామంతా కలిసే ఉన్నామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌కు చాలా కీలకం కానున్నాయి. ఆ పార్టీ పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంది. ఈ సారైనా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో థరూర్ వంటి ప్రముఖ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఆ పార్టీకి కీలకం కానున్నది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






