Supreme Court | ఢిల్లీ అల్లర్ల కేసులో పలువురు నిందితులకు బెయిల్
Supreme Court | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 ఢిల్లీ అల్లర్ల కేసు (Delhi Riots)లో పలువురు నిందితులకు సుప్రీం కోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు ఉమర్ ఖలీద్, శార్జీల్ ఇమామ్‌లకు మాత్రం బెయిల్ తిరస్కరించింది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 ఢిల్లీ అల్లర్ల కేసు (Delhi Riots)లో పలువురు నిందితులకు సుప్రీం కోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు ఉమర్ ఖలీద్, శార్జీల్ ఇమామ్‌లకు మాత్రం బెయిల్ తిరస్కరించింది. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ ఆలస్యం అవడం బెయిల్ ఇచ్చేందుకు ప్రాతిపదిక కాదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత అంశంలో స్వేచ్ఛకు భిన్నమైన అర్థం ఉందని తెలిపింది. ఈ క్రమంలో నిందితుల బెయిల్ పిటిషన్లను వేర్వేరుగా విచారించాలని నిర్ణయించింది.
ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారని ఉమర్ ఖలీద్, శార్జీల్ ఇమామ్‌లపై అభియోగాలు నమోదయ్యాయి. మిగిలిన నిందితులైన గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మహమ్మద్ షకీల్‌ఖాన్, షాబాద్ అహ్మద్‌లకు బెయిల్ మంజూరు చేసింది. వీరితో పోలిస్తే ఉమర్ ఖలీద్, శార్జీల్ ఇమామ్‌ల పరిస్థితి వేరని, వారిద్దరికీ అల్లర్లలో పాత్ర ఉందని ప్రాథమికంగా ఆధారాలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. వీళ్లిద్దరూ ఏడాది తరువాతే బెయిల్ కోసం ఆశ్రయించాలని సూచించింది.
అసలేమిటీ ఢిల్లీ అల్లర్లు..
2019లో అప్పటి కేంద్రప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) (CAA) ను ప్రవేశపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని జాఫ్రాబాద్, షాహీన్‌బాగ్ వంటి ప్రాంతాల్లో మహిళలు దీక్షలు ప్రారంభించారు. దాదాపు మూడు నెలల పాటు ఈ ప్రదర్శనలు కొనసాగాయి. దీనికి కొనసాగింపుగా 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. అనేక ఇళ్లు, వ్యాపార సంస్థలు, మసీదులు, దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ఈ అల్లర్ల వెనుక మేధావుల ముసుగులో ఉగ్రవాదులు ఉన్నారని ఢిల్లీ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. కేంద్రప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. నిందితులను ఉపా (UAPA) చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






