Philippines Earthquake | ఫిలిప్పీన్స్‌ను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Philippines Earthquake | భారీ భూకంపంతో (Earthquake) ఫిలిప్పీన్స్ (Philippines) వణికిపోయింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతమైన మిండనావో (Mindanao) ద్వీపం సమీపంలో భూమి కంపించింది.
International | Published On Jun 8, 2026, 7.36 am IST
Philippines Earthquake | త్రినేత్ర.న్యూస్: భారీ భూకంపంతో (Earthquake) ఫిలిప్పీన్స్ (Philippines) వణికిపోయింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతమైన మిండనావో (Mindanao) ద్వీపం సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.8గా నమోదయింది. భూమి అంతర్భాగంలో 79 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూకంప తీవ్రతకు అధికారులు సునామీ (Tsunami) హెచ్చరికలు జారీచేశారు. దీంతో వేలాది మంది తీరప్రాంత వాసులు భయాందోళనల మధ్య సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో భవనాలు నేలమట్టయమ్యాయి.

ఫిలిప్పీన్స్ అగ్నిపర్వతాలు, భూకంపాల పరిశోధనా సంస్థ (PHIVOLCS) ప్రకారం కొన్ని తీరప్రాంతాల్లో సాధారణ అలల ఎత్తుకంటే ఒక మీటర్‌కు పైగా సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉంది. దీంతో దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని పలు ప్రావిన్సుల్లో సముద్ర తీర ప్రాంతాల ప్రజలకు తక్షణమే ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లాలని లేదా లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.
Another video captures the Jollibee building collapse in General Santos, Philippines following powerful earthquake. No word on casualties. https://t.co/LJEVl0qTjC pic.twitter.com/DgixNijwoY
— AZ Intel (@AZ_Intel_) June 8, 2026
అయితే భూకంప తీవ్రత 7.8గా నమోదయిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. భూకంప కేంద్రం ఉపరితలానికి అత్యంత సమీపంలో ఉండటంతో ప్రకంపనల తీవ్రత అధికంగా నమోదయిందని తెలిపింది. తొలుత ఈ భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేసిన జీఎఫ్‌జెడ్.. అనంతరం దానిని సవరించి 7.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది.
More wild footage from today’s massive earthquake in the Philippines. pic.twitter.com/Cdylad2d7W
— Breaking911 (@Breaking911) June 8, 2026
వరుస భూకంపాలు..
మిండనావో ద్వీపంలో వరుస భూకంపాలు వచ్చాయి. తొలుత ఉదయం 5 గంటల సమయంలో 7.7 తీవ్రతతో భూమి కంపించగా, 5.18 గంటలకు 6.4 తీవ్రతతో, ఉదయం 6.25 గంటలకు 6.6 తీవ్రతతో మరోసారి భారీ భూకంపం వచ్చింది.
#EXCLUSIVE PHILIPPINES: MAGNITUDO 8.7 MINDANAO EARTHQUAKE
Monday, 8th June 2026 pic.twitter.com/XnxfEH7Quz
— Agraprana Pahlawan (@skynewsagra) June 8, 2026
ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లండి..
శక్తివంతమైన భూకంపం రావడంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ అధికారులను ఆదేశించారు. మిండనావోలోని ప్రభావిత ప్రాంతాల్లో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అన్ని స్థాయిల తరగతులను నిలిపివేయాలని స్పష్టం చేశారు. సునామీ హెచ్చరికలను పాటించాలని ప్రజలను కోరారు. తీర ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. కాగా, భూకంపం కారణంగా భవనాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రాణనష్ట, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
🇵🇭 - Developing: A powerful earthquake struck off Mindanao in the southern Philippines on June 8 (local time).
Early magnitude estimates are being revised and currently sit around 8.2, according to the German Research Centre for Geosciences and the U.S. tsunami warning system —… pic.twitter.com/723K9SRwnQ
— 🔥🗞The Informant (@theinformant_x) June 8, 2026
భూటాన్‌లోనూ..
మరోవైపు హిమాలయ దేశం భూటాన్‌లోనూ (Bhutan) వరుస భూకంపాలు వచ్చాయి. ఆదివారం రాత్రి 11.06 గంటలకు 5.8 తీవ్రతతో భూమి కంపించింది. ఆదివారం రాత్రి 11.18 గంటల సమయంలో 2.8 తీవ్రతతో, 11.52 గంటలకు 2.4 తీవ్రతతో స్వల్ప భూకంపాలు వచ్చాయి. దీని ప్రభావంతో భారత్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్ కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
EQ of M: 5.8, On: 07/06/2026 23:06:43 IST, Lat: 27.627 N, Long: 89.660 E, Depth: 26 Km, Location: Bhutan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @DrNKalaiselvi @GSuresh_NCS @ndmaindia pic.twitter.com/6fmNAuWIAD— National Center for Seismology (@NCS_Earthquake) June 7, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Travels Bus | డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన ట్రావెల్స్.. బస్సులో 36 మంది ప్రయాణికులు
- ●Horoscope | జూన్ 8 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మానసిక ప్రశాంతత లోపిస్తుంది!
- ●Honey Eating Record | కేవలం ఒక్క నిమిషంలో 1.2 కిలోల తేనెను లాగించేశాడు.. వింత గిన్నిస్ రికార్డ్!
- ●FSSAI Newspaper Ban | న్యూస్ పేపర్లో చుట్టి ఇచ్చిన వేడివేడి సమోసాలు, బజ్జీలు తింటున్నారా? వెంటనే ఆపేయండి.. లేదంటే..?
- ●Software Engineer Noodle Stall | "సాఫ్ట్వేర్ జాబ్ బోరింగ్ బాస్".. లక్షల ప్యాకేజీ వదిలేసి గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి నూడుల్స్ అమ్ముకుంటున్న 'మెటా' టెకీ
- ●Ease Of Doing Business India | భారత్‌లో వ్యాపారం చేయడం ఇక డెడ్ ఈజీ: స్టార్టప్‌ల నుంచి డిజిటల్ పేమెంట్స్ వరకు.. దేశ ముఖచిత్రాన్ని మార్చేసిన భారీ మార్పులివే!

Travels Bus | డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన ట్రావెల్స్.. బస్సులో 36 మంది ప్రయాణికులు

Horoscope | జూన్ 8 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మానసిక ప్రశాంతత లోపిస్తుంది!

Honey Eating Record | కేవలం ఒక్క నిమిషంలో 1.2 కిలోల తేనెను లాగించేశాడు.. వింత గిన్నిస్ రికార్డ్!

FSSAI Newspaper Ban | న్యూస్ పేపర్లో చుట్టి ఇచ్చిన వేడివేడి సమోసాలు, బజ్జీలు తింటున్నారా? వెంటనే ఆపేయండి.. లేదంటే..?





