Supreme Court | ఫామ్ 6 సమర్పించినందుకు ఓటర్లపై ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండదు.. సుప్రీంకోర్టు భరోసా
Supreme Court | ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన ఏ ఓటరైనా.. మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవడం కోసం ఫామ్-6 (Form 6) ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు ఉండబోవని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : మహారాష్ట్రలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా పేర్లు తొలగించబడిన ఓటర్లకు సుప్రీంకోర్టు (Supreme Court) భారీ ఊరట కల్పించింది. జాబితా నుంచి తొలగించబడిన ఏ ఓటరైనా.. మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవడం కోసం ఫామ్-6 (Form 6) ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు ఉండబోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సర్ సమయంలో ఓటర్ల తొలగింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను నవంబర్ 5న అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
మహారాష్ట్రలో ఓట్ల తొలగింపును (Maharashtra SIR) సవాలు చేస్తూ అరుణ్ ఆనందగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) సూర్యకాంత్ (Surya Kant), జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సీనియర్ అడ్వొకేట్ అరవింద్ దాతర్ కోర్టుకు కొన్ని కీలక విషయాలు తెలియజేశారు. పాత నివాస భవనాలు రీడెవలప్‌మెంట్‌కు గురవుతుండటం వల్ల.. చాలా మంది నివాసితులు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. అలా ఇళ్లు మారుతున్న వారి సంఖ్య వేలల్లో ఉందని చెప్పారు. సర్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత అడ్రెస్‌లో లేరని చెప్పి వారందరినీ ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించారని వివరించారు. ముంబైలో ఇలాంటి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులు 3,500 ఉండగా.. పూణెలో 1,500 ఉన్నాయని ధర్మాసనానికి తెలియజేశారు.
దీంతో లిస్ట్ నుంచి తొలగించబడిన ఓటర్లు ఫామ్-6 సమర్పించి మళ్లీ కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఇప్పటికే నమోదై, సవరణలో తొలగించబడిన ఓటర్లు మళ్లీ ఇందులో దరఖాస్తు చేసుకుంటే తప్పుడు డిక్లరేషన్ ఇచ్చారనే నెపంతో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద శిక్షార్హులయ్యే ప్రమాదం ఉందనే ఆందోళనను కోర్టు దృష్టికి తెచ్చారు. దాతర్ లేవనెత్తిన ఈ ఆందోళనపై స్పందించిన సీజేఐ ధర్మాసనం.. కేవలం దరఖాస్తు చేసుకున్నందుకు ఎవరిపైనా ఎలాంటి క్రిమినల్ చర్యలు ఉండవని మౌఖికంగా హామీ ఇచ్చింది. అదేవిధంగా ఈ పిటిషన్‌పై సమగ్ర వివరణ కోరుతూ భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది.
Also Read..
జడ్జీల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు: 14 రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు

Judicial officers Retirement Age | జడ్జీల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు: 14 రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అక్టోబర్ 26, 2026

Revanth Reddy | కేసీఆర్ను, జగదీశ్ రెడ్డిని గుంజబాతి కొట్టినా తప్పులేదు
అక్టోబర్ 23, 2026

Revanth Reddy | ఇక తాగు నీరే.. సాగుకు నీళ్లిచ్చే ఛాన్సే లేదు
అక్టోబర్ 23, 2026
తాజావార్తలు
- ●Cyclone Arnab | అర్నాబ్ ఎఫెక్ట్.. రేపట్నుంచి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
- ●Judicial officers Retirement Age | జడ్జీల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు: 14 రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లో భారీ రికవరీ.. 483 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●Talasani Srinivas Yadav | ఓటరు నమోదు బాధ్యత ముమ్మాటికీ ఎన్నికల కమిషన్‌దే
- ●Rahul Gandhi | జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించమని మోదీకి చెప్పండి.. 30 సెకన్లలో నిరసనలు ఆగిపోతాయి.. ఢిల్లీ వ్యాపారులకు రాహుల్
- ●Anirudh Reddy | నేను సచ్చిపోతెనే బిల్లులిస్తరా? అట్లయితే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా

Cyclone Arnab | అర్నాబ్ ఎఫెక్ట్.. రేపట్నుంచి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

Judicial officers Retirement Age | జడ్జీల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు: 14 రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Stock Markets | స్టాక్ మార్కెట్లో భారీ రికవరీ.. 483 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

Talasani Srinivas Yadav | ఓటరు నమోదు బాధ్యత ముమ్మాటికీ ఎన్నికల కమిషన్‌దే



