SARTHAK PDS Scheme | రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఐదేళ్లు పీడీఎస్ స్కీమ్ పొడిగింపు
దేశవ్యాప్తంగా ఉన్న 81.35 కోట్ల రేషన్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థను అత్యాధునికంగా మార్చేందుకు 'సార్థక్-పీడీఎస్'కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- స్మార్ట్ రేషన్: దేశవ్యాప్తంగా పీడీఎస్ వ్యవస్థ ప్రక్షాళన
- 'సార్థక్-పీడీఎస్'కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
SARTHAK PDS Scheme | త్రినేత్ర.న్యూస్ : త్రినేత్ర.న్యూస్: దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, పకడ్బందీగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, 'సార్థక్-పీడీఎస్' (SARTHAK-PDS) ప్రాజెక్టును ఒక సమగ్ర పథకంగా కొనసాగించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పౌరులకే పెద్దపీట వేస్తూ పీడీఎస్ వ్యవస్థను ఆధునీకరించడంలో ఇదొక ముందడుగు అని ఆయన అభివర్ణించారు.
2031 వరకు కొనసాగింపు.. భారీగా నిధులు
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమలు కోసం 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.25,530 కోట్లను కేటాయించింది. ఈ పథకం మార్చి 31, 2031 వరకు అమల్లో ఉంటుందని కేంద్రమంత్రి తెలిపారు. దీని ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో ఉన్న సుమారు 81.35 కోట్ల మందికి ఆహార భద్రత మరింత పటిష్టం కానుంది. రేషన్ సరుకుల రవాణాను మెరుగుపరచడం, సరఫరా వ్యవస్థలను ఆధునీకరించడం ద్వారా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, రేషన్ డీలర్లకు పెద్ద ఎత్తున మద్దతు లభించనుంది.
రేషన్ పంపిణీలో ఏఐ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ
రేషన్ పంపిణీలో దళారుల వ్యవస్థను, అక్రమాలను సమూలంగా నిర్మూలించేందుకు సరికొత్త టెక్నాలజీని రంగంలోకి దించుతున్నారు. సార్థక్-పీడీఎస్ కింద స్మార్ట్-పీడీఎస్ (SMART-PDS) కార్యక్రమాలను అనుసంధానం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం, ఈ-పీవోఎస్ యంత్రాల ఆటోమేషన్, ఏఐ ఆధారిత మానిటరింగ్, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లాంటి అంశాలతో పాటు లేటెస్ట్ టెక్నాలజీలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్ వంటి వాటిని ఈ సిస్టమ్‌లో అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల పీడీఎస్ వ్యవస్థలో సామర్థ్యం పెరగడమే కాకుండా, పారదర్శకత వస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు సజావుగా అందుతాయని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
Cabinet has approved the integration and continuation of SARTHAK-PDS as an umbrella scheme marking a significant step towards building a unified, transparent and citizen-centric Public Distribution System under the leadership of Hon'ble Prime Minister Shri @narendramodi Ji.
With… pic.twitter.com/XFcqzFFRvZ
— Dharmendra Pradhan (@dpradhanbjp) May 27, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

PM Modi | దేశవ్యాప్తంగా భానుడి భగభగలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
మే 27, 2026

Mekedatu Dam Issue | కావేరీ జలాలపై మళ్లీ రగడ.. మేకెదాటు డ్యామ్‌ను అడ్డుకోవాలని ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
మే 26, 2026

Nirmala Sitharaman | దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం తగదు : నిర్మలమ్మ
మే 25, 2026
తాజావార్తలు
- ●Feroz Khan | గాంధీ భవన్లో లొల్లి.. కొట్టుకున్న ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్.. వీడియో
- ●India Stealth Fighter Jet | అగ్రదేశాల సరసన భారత్.. స్వదేశీ టెక్నాలజీతో ఫైటర్ జెట్స్‌ను తయారు చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- ●Harish Rao | మూడో డిస్కం ఏర్పాటు.. ప్రైవేటీకరణ దిశగా విద్యుత్ రంగం : హరీశ్‌రావు
- ●Balka Suman | ఇలా.. నోరు జారితే ఎలా? సుమన్ వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
- ●CM Vijay | ప్రధాని మోదీతో విజయ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- ●Gym | వేసవిలో రోజూ జిమ్ చేసే వారు జాగ్రత్త.. ఈ సూచనలను పాటించండి..

Feroz Khan | గాంధీ భవన్లో లొల్లి.. కొట్టుకున్న ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్.. వీడియో

India Stealth Fighter Jet | అగ్రదేశాల సరసన భారత్.. స్వదేశీ టెక్నాలజీతో ఫైటర్ జెట్స్‌ను తయారు చేయనున్న ప్రైవేట్ కంపెనీలు

Harish Rao | మూడో డిస్కం ఏర్పాటు.. ప్రైవేటీకరణ దిశగా విద్యుత్ రంగం : హరీశ్‌రావు

Balka Suman | ఇలా.. నోరు జారితే ఎలా? సుమన్ వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం



