Sanjay Dutt | మంత్రి సమక్షంలోనే.. మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించిన బాలీవుడ్ స్టార్
Sanjay Dutt | హిందీలో కాకుండా మరాఠీ (Marathi)లో మాట్లాడాలని కోరిన మంత్రి ప్రతాప్ సర్నాయక్ అభ్యర్థనను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) సున్నితంగా తిరస్కరించడం రాజకీయ వివాదానికి దారితీసింది.
Sanjay Dutt | మహారాష్ట్ర (Maharashtra)లో కచ్చితంగా స్థానిక భాషైన మరాఠీ (Marathi) మాట్లాడాల్సిందేనని అక్కడి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మరాఠీ మాట్లాడాలని కోరిన మంత్రి ప్రతాప్ సర్నాయక్ (Pratap Sarnaik) అభ్యర్థనను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) సున్నితంగా తిరస్కరించడం రాజకీయ వివాదానికి దారితీసింది.
ఆదివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రతాప్ సర్నాయక్ (Pratap Sarnaik)తోపాటూ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై హిందీలో కాకుండా మరాఠీలో మాట్లాడాల్సిందిగా సంజయ్ దత్‌ను మంత్రి కోరారు. అయితే, మంత్రి అభ్యర్థనను సంజయ్ దత్ సున్నితంగా తిరస్కరించారు. ఈ సందర్భంగా తన జైలు జీవితాన్ని ఉదాహరణగా చెప్పారు. "ప్రతాప్ భాయ్.. నేను ఎర్వాడ జైల్లో ఆరు సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు మరాఠీ నేర్చుకోలేకపోయాను. కొంచెంగా నేర్చుకున్నాను అంతే" అని సరదాగా నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్ సర్నాయక్‌తో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు. అయితే, ముంబైలో ఆటో, టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాష రావడం తప్పనిసరి అనే కఠిన నిబంధనలను ప్రభుత్వం అమలు చేస్తున్న తరుణంలో.. ఒక ప్రముఖ నటుడు ఏకంగా మంత్రి సమక్షంలోనే మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.
రాష్ట్రంలో ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లు కచ్చితంగా స్థానిక భాష మరాఠీలో మాట్లాడాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 12 నుంచి మహారాష్ట్ర మోటార్ వాహనాల సవరణ రూల్స్ ప్రకారం కమర్షియల్ డ్రైవర్లకు మరాఠీ మాట్లాడటం తప్పనిసరి చేసింది. రవాణా శాఖ నిర్వహించిన పరీక్షల్లో విఫలమైన వందలాది మంది నాన్-మరాఠీ డ్రైవర్లకు గతంలో నోటీసులు కూడా జారీ అయ్యాయి. అయితే డ్రైవర్ల సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రాథమిక మరాఠీ నేర్చుకోవడానికి ప్రభుత్వం ఏడాది సమయం ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
కొత్త శిఖరాలకు భారత్-ఫ్రాన్స్ సంబంధాలు : ప్రధాని మోదీ
జీమెయిల్, డాక్స్‌లో గూగుల్ కొత్త వాయిస్ ఫీచర్లు
మైనారిటీ సంక్షేమానికి రూ.2,893 కోట్ల బడ్జెట్ : మంత్రి అజారుద్దీన్
తాజావార్తలు
- ●Google | జీమెయిల్, డాక్స్‌లో గూగుల్ కొత్త వాయిస్ ఫీచర్లు
- ●Legislative Council | మైనారిటీ సంక్షేమానికి రూ.2,893 కోట్ల బడ్జెట్ : మంత్రి అజారుద్దీన్
- ●Ponnam Prabhakar vs Tata Madhu | స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదు.. ఆ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందే
- ●PM Modi | కొత్త శిఖరాలకు భారత్-ఫ్రాన్స్ సంబంధాలు : ప్రధాని మోదీ
- ●MLA Sabitha | గూండాలు దాడి చేశారని అనుమానముంది
- ●CM Revanth Reddy | రైతుల కోసం జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి

Google | జీమెయిల్, డాక్స్‌లో గూగుల్ కొత్త వాయిస్ ఫీచర్లు

Legislative Council | మైనారిటీ సంక్షేమానికి రూ.2,893 కోట్ల బడ్జెట్ : మంత్రి అజారుద్దీన్

Ponnam Prabhakar vs Tata Madhu | స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదు.. ఆ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందే

PM Modi | కొత్త శిఖరాలకు భారత్-ఫ్రాన్స్ సంబంధాలు : ప్రధాని మోదీ






