Baby Girl | 200 ఏళ్ల తర్వాత.. ఆ ఇంట ఆడబిడ్డ జననం
Baby Girl | ఆడపిల్లలు పుడితే బరువుగా భావిస్తున్న నేటి సమాజంలో.. ఓ ఇంట మాత్రం ఆడ శిశువు జన్మించిందని ఘనంగా వేడుక నిర్వహించుకున్నారు. ఆడబిడ్డ అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్న తరుణంలో.. ఈ కుటుంబం మాత్రం ఆ పసిపాపను డప్పు వాయిద్యాలతో ఇంటికి ఊరేగింపుగా తీసుకొచ్చారు.
Baby Girl | త్రినేత్ర.న్యూస్ : ఆడపిల్లలు పుడితే బరువుగా భావిస్తున్న నేటి సమాజంలో.. ఓ ఇంట మాత్రం ఆడ శిశువు జన్మించిందని ఘనంగా వేడుక నిర్వహించుకున్నారు. ఆడబిడ్డ అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్న తరుణంలో.. ఈ కుటుంబం మాత్రం ఆ పసిపాపను డప్పు వాయిద్యాలతో ఇంటికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. దాదాపు 200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడ పిల్ల పుట్టడంతో.. ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.
మహారాష్ట్ర బీద్ జిల్లాలోని దహిఫాలే గ్రామానికి చెందిన ఓ ఇంట్లో నాలుగు తరాల నుంచి ఒక అమ్మాయి కూడా జన్మించలేదు. దాదాపు రెండు శతాబ్దాలుగా ఆ కుటుంబంలో అమ్మాయి అనే మాటే లేదు. కానీ ఇటీవల ఓ మహిళకు ఆడ శిశువు జన్మించింది. దీంతో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఆ పసిపాపకు గార్గి అని నామకరణం చేశారు. ఇక ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చే క్రమంలో.. రథంపై ఊరేగించారు. డప్పు, వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. తమ బంధువులను అందర్నీ ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆ చిన్నారి తాత మాట్లాడుతూ.. రెండు శతాబ్దాల తర్వాత మా ఇంట్లో అమ్మాయి జన్మించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. ఇప్పటి వరకు మా ఇంట్లో అందరూ మగ పిల్లలే. ఇప్పుడు ఆడబిడ్డ జన్మించడంతో.. అమ్మాయిలు లేరనే బాధ లేకుండా పోయిందన్నాడు.
గార్గి నానమ్మ మాట్లాడుతూ.. మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని సంతోషంతో ఉప్పొంగిపోయారు. చిన్నారిని ఘనంగా ఇంటికి తీసుకురావాలని ఆస్పత్రిలో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నామని, ఆ మేరకు రథంపై ఊరేగింపుగా తీసుకొచ్చామని చెప్పారు.
గార్గి తండ్రి మాట్లాడుతూ.. తమకు ఆడపిల్ల పుట్టడం ఎంతో సంతోషంగా ఉంది. అమ్మాయిలు తండ్రికి చాలా దగ్గరగా ఉంటారు. ఆమెను ఒక పువ్వు మాదిరి పెంచుకుంటామని చెప్పాడు. చాలా మంది అబ్బాయిలు కావాలని కోరుకుంటారు.. కానీ మేం ఆడబిడ్డ కోసం ఎదురుచూశామని తెలిపాడు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
- ●Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ
- ●Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ - విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
- ●Congress Party | కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ నిరసన ర్యాలీ
- ●Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు

KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు

CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ

Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ - విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?






