Legislative Council | మైనారిటీ సంక్షేమానికి రూ.2,893 కోట్ల బడ్జెట్ : మంత్రి అజారుద్దీన్
Legislative Council | మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. ‘మైనారిటీ సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట’ అని పేర్కొన్నారు. పెంచిన నిధులతో మైనారిటీల విద్య, సామాజిక–ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని చెప్పారు.
Legislative Council | మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. ‘మైనారిటీ సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట’ అని పేర్కొన్నారు. పెంచిన నిధులతో మైనారిటీల విద్య, సామాజిక–ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. మైనారిటీల విద్యా, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. మైనారిటీ సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులు, విడుదల, వ్యయానికి సంబంధించిన వివరాలను శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై పూర్తి వివరాలను ఇప్పటికే సభకు లిఖితపూర్వకంగా అందజేసినట్లు తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మైనారిటీ సంక్షేమానికి రూ.2,256 కోట్లు కేటాయించగా, అందులో రూ.2,122.74 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. విడుదలైన నిధుల్లో రూ.961.54 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. అదేవిధంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,844 కోట్లు కేటాయించగా, రూ.2,317.65 కోట్లు విడుదల అయ్యాయని, ఇప్పటివరకు రూ.1,010.63 కోట్లు వ్యయం చేసినట్లు మంత్రి వెల్లడించారు.
జనాభా శాతం ఒక్కటే ప్రాతిపదిక కాదు
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభాలో మైనారిటీలు 14.27 శాతం ఉన్నారని మంత్రి తెలిపారు. అయితే కేవలం జనాభా శాతాన్ని ప్రాతిపదికగా తీసుకుని మైనారిటీ సంక్షేమ నిధులను కేటాయించడం జరగదని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న నిధులు, మైనారిటీ వర్గాల అవసరాలు, వివిధ సంక్షేమ పథకాల అమలు, వాటి పరిధి తదితర అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని పథకం వారీగా నిధులను కేటాయిస్తున్నామని మంత్రి వివరించారు. మైనారిటీ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచిందని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి మైనారిటీ సంక్షేమ పథకాల కోసం రూ.2,893.26 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. మైనారిటీ సంక్షేమానికి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా పథకాల బడ్జెట్‌ను కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు.
విద్య, సామాజిక–ఆర్థిక అభివృద్ధే లక్ష్యం
మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పెంచిన బడ్జెట్ కేటాయింపులతో మైనారిటీలకు విద్యా అవకాశాలు, సామాజిక భద్రత, ఆర్థిక సాధికారత, సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతంగా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ, మైనారిటీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ శాసనమండలికి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar vs Tata Madhu | స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదు.. ఆ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందే
- ●PM Modi | కొత్త శిఖరాలకు భారత్-ఫ్రాన్స్ సంబంధాలు : ప్రధాని మోదీ
- ●MLA Sabitha | గూండాలు దాడి చేశారని అనుమానముంది
- ●CM Revanth Reddy | రైతుల కోసం జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి
- ●Jagadish Reddy NIMS hospital | నిమ్స్‌కు జగదీష్ రెడ్డి
- ●Pranav Constructions IPO | ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ ఐపీవో.. లిస్టింగ్‌కు ముందే భారీ లాభం..

Ponnam Prabhakar vs Tata Madhu | స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదు.. ఆ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందే

PM Modi | కొత్త శిఖరాలకు భారత్-ఫ్రాన్స్ సంబంధాలు : ప్రధాని మోదీ

MLA Sabitha | గూండాలు దాడి చేశారని అనుమానముంది

CM Revanth Reddy | రైతుల కోసం జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి




