MLA Sabitha | గూండాలు దాడి చేశారని అనుమానముంది
MLA Sabitha | అసెంబ్లీ బయట పోలీసుల ముసుగులో గూండాలు మాపై అలా ప్రవర్తించారేమోనని అనుమానంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ లేకపోతే మమ్మల్ని కిందపడేసి తొక్కేవారని వాపోయారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎవరినైనా గొంతు పట్టి పిసికేస్తున్నారని మండిపడ్డారు.
- కేటీఆర్ లేకపోతే మమ్మల్ని కిందపడేసి తొక్కేవారు
- రేవంత్‌కు మహిళలంటే గౌరవం లేదు
- పైగా సీతక్క డ్రామాలు అని మాట్లాడుతుంది
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం
MLA Sabitha | త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీ బయట పోలీసుల ముసుగులో గూండాలు మాపై అలా ప్రవర్తించారేమోనని అనుమానంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ లేకపోతే మమ్మల్ని కిందపడేసి తొక్కేవారని వాపోయారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎవరినైనా గొంతు పట్టి పిసికేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, అదానీ బొమ్మలు ఉన్న టీ షర్ట్స్ వేసుకొని రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు వెళ్లారని.. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. పైగా డ్రామాలు ఆడుతున్నారని మంత్రి సీతక్క మాట్లాడడం బాధాకరమన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆమె మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఈరోజు అసెంబ్లీ బయట జరిగిన ఘటన హేయమైనది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అతిగా ప్రవర్తించారు. మా ఎమ్మెల్యేలు వేసుకున్న నల్ల టీ షర్ట్స్ పై అభ్యంతరకరమైన పదాలు ఏం లేవు. ముఖ్యమంత్రికి మహిళలంటే గౌరవం లేదు. మా మహిళ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారు. నా గొంతు, జుట్టు పట్టుకొని లాగారు.
పాలిటెక్నిక్ విద్యార్థులు ఇలానే ప్రశ్నిస్తే గొంతు పట్టుకొని పిసికారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే గొంతు పట్టుకొని పిసికేస్తున్నారు. కేటీఆర్ లేకపోతే మమ్మల్ని కిందపడేసి తొక్కేవారు. ఈ ప్రభుత్వం ఏ విధంగా అవలంబిస్తుందో ప్రజలు గమనించాలి. పాలనపై ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యమంత్రిని సంతృప్తి పరిచేందుకే పోలీసులు అలా ప్రవర్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అహంకారం ఎక్కువైంది. జరిగిన ఘటనపై మహిళా మంత్రి సీతక్క ఖండించాల్సింది పోయి డ్రామాలు అని మాట్లాడుతుంది. వెయ్యి రోజుల పాలనపై హామీలు అమలు చేయాలని మేం అడిగాం. మమ్మల్ని అసెంబ్లీకి రాకుండా గేటు వద్దే అడ్డుకున్నారు అని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | రైతుల కోసం జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి
- ●Jagadish Reddy NIMS hospital | నిమ్స్‌కు జగదీష్ రెడ్డి
- ●Pranav Constructions IPO | ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ ఐపీవో.. లిస్టింగ్‌కు ముందే భారీ లాభం..
- ●Sunitha Laxma Reddy | రాష్ట్రంలో కొనసాగుతున్న దుశ్శాసన పర్వం.. మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా?: సునీతా లక్ష్మారెడ్డి
- ●Vakiti Srihari | స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను తగవు : మంత్రి వాకిటి శ్రీహరి
- ●Harish Rao | మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగుతారా?.. ఇదేం రాజ్యం రేవంత్?

CM Revanth Reddy | రైతుల కోసం జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి

Jagadish Reddy NIMS hospital | నిమ్స్‌కు జగదీష్ రెడ్డి

Pranav Constructions IPO | ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ ఐపీవో.. లిస్టింగ్‌కు ముందే భారీ లాభం..

Sunitha Laxma Reddy | రాష్ట్రంలో కొనసాగుతున్న దుశ్శాసన పర్వం.. మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా?: సునీతా లక్ష్మారెడ్డి




