త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sabarimala Gold Theft Case | శ‌బ‌రిమ‌ల బంగారం దొంగ‌త‌నం కేసులో కీల‌క ప‌రిణామం..

Sabarimala Gold Theft Case | శ‌బ‌రిమ‌ల ఆల‌య బంగారం దొంగ‌త‌నం కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుక‌న్న‌ది. ఈ వ్య‌వ‌హారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ మంగ‌ళ‌వారం మూడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వ‌హించింది.

P

National | Published On Jan 20, 2026, 3.53 pm IST

Sabarimala Gold Theft Case | శ‌బ‌రిమ‌ల బంగారం దొంగ‌త‌నం కేసులో కీల‌క ప‌రిణామం..
Advertisement
  • మూడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో ఈడీ దాడులు

Sabarimala Gold Theft Case | శ‌బ‌రిమ‌ల ఆల‌య బంగారం దొంగ‌త‌నం కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుక‌న్న‌ది. ఈ వ్య‌వ‌హారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ మంగ‌ళ‌వారం మూడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వ‌హించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం.. కేర‌ళ‌తో పాటు త‌మిళ‌నాడు, క‌ర్నాట‌లో సుమారు 21 ప్రాంతాల్లో ఈడీ దాడులు జ‌రిపింద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, మాజీ ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు ఏ పద్మకుమార్ నివాసంలో సైతం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సోదాలు నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

కేర‌ళ పోలీసులు న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఇటీవ‌ల పీఎంఎల్ఏ కింద కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. సున్నితమైన ఈ కేసును కేర‌ళ హైకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రాష్ట్ర ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం సిట్ ద‌ర్యాప్తు చేస్తున్న‌ది. ఈ ద‌ర్యాప్తులో అధికార దుర్వినియోగం, ప‌రిపాల‌నప‌ర‌మైన లోపాలు, అయ్య‌ప్ప స్వామి ఆల‌యంలోని విగ్ర‌హాలకు సంబంధించిన బంగారాన్ని అప‌హ‌రించ‌డం స‌హా నేర‌పూరిత కుట్ర‌తో స‌హా ప‌లు అవ‌క‌త‌వ‌క‌ల‌పై సిట్ ద‌ర్యాప్తు నిర్వ‌హిస్తున్న‌ది. అయ్య‌ప్ప స్వామి గ‌ర్భాల‌యం ద్వార‌పాల‌కుల బంగారు తాప‌డాల్లో తేడాల‌పై సిట్ విచార‌ణ జ‌రుపుతోంది.

అయితే, శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో బంగారం దొంగ‌త‌నం సంవ‌త్స‌రాలుగా క్ర‌మ‌బ‌ద్ధంగా, వ్య‌వ‌స్థీకృతంగా బంగారం దొంగ‌త‌నం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఈడీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఆలయ ప్రసాదాలు, పూజా సామగ్రి విష‌యంలోనూ అవ‌క్ర‌మాలు జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని అనుమానిస్తున్నారు. చాలాకాలంగా వివిధ స్థాయిలో కుట్ర‌, ప్ర‌ణాళిక‌బ‌ద్ధ‌మైన లావాదేవీలు జ‌రిగిన‌ట్లుగా గుర్తించింది. ఈ క్ర‌మంలో ట్రావెన్‌కోర్ బోర్డు అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, మధ్యవర్తులు, వ్యాపారులంతా నేర‌పూరిత కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లుగా ఈడీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కోర్టు అనుమ‌తి మేర‌కు బంగారం దొంగ‌త‌నం, స్మ‌గ్లింగ్‌కు సంబంధించి ఈడీ జ‌న‌వ‌రి 9న కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్న‌ది.

Advertisement

తాజావార్తలు

Advertisement