త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Assembly | అసెంబ్లీలో జాతీయ జెండా ఎగుర‌వేసిన స్పీక‌ర్

Telangana Assembly | తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో శాసన సభాపతి గ‌డ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

S

Telangana | Published On Sep 17, 2026, 11.26 am IST

Telangana Assembly | అసెంబ్లీలో జాతీయ జెండా ఎగుర‌వేసిన స్పీక‌ర్
Advertisement

Telangana Assembly | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో శాసన సభాపతి గ‌డ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనమండలి కార్యదర్శి డా. వి నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి, లెజిస్లేచర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement