త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | లారీని ఢీకొట్టిన మినీ బ‌స్సు.. డ్రైవ‌ర్ స‌హా ఆరుగురు దుర్మ‌ర‌ణం

Road Accident | అస్సాంలోని గువాహటి - సోనాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మ‌ర‌ణించ‌గా, ప‌లువురు తీవ్రంగా గాయప‌డ్డారు.

G

National | Published On Aug 31, 2026, 8.01 am IST

Road Accident | లారీని ఢీకొట్టిన మినీ బ‌స్సు.. డ్రైవ‌ర్ స‌హా ఆరుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్‌: అస్సాంలోని గువాహటి - సోనాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మ‌ర‌ణించ‌గా, ప‌లువురు తీవ్రంగా గాయప‌డ్డారు. మినీ బ‌స్సు గువాహ‌టి నుంచి నాగావ్ వైపు ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న‌ది. ఈ క్ర‌మంలో నలగేదర వద్ద జాతీయ‌ర‌హ‌దారిపై (National Highway) మినీబ‌స్సు గుంత‌లో ప‌ట‌డంతో టైరు ప‌గిలిపోయింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవ‌డంతో అది ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో మినీబ‌స్సు డ్రైవ‌ర్ స‌హా ఆరుగురు మృతిచెందారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. వారిలో ప‌లువురి పరిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ‌న్నారు.

Advertisement
Advertisement