త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special TET | ఇన్‌స‌ర్వీస్ టీచ‌ర్ల కోసం స్పెష‌ల్‌ టెట్‌.. ప‌రీక్షలు ఎప్పుడంటే?

Special TET | రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వ‌హించే స్పెష‌ల్ టెట్ (Special TET) షెడ్యూల్‌ను పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌క‌టించింది.

G

Telangana | Published On Aug 31, 2026, 6.22 am IST

Special TET | ఇన్‌స‌ర్వీస్ టీచ‌ర్ల కోసం స్పెష‌ల్‌ టెట్‌.. ప‌రీక్షలు ఎప్పుడంటే?
Advertisement

Special TET | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వ‌హించే స్పెష‌ల్ టెట్ (Special TET) షెడ్యూల్‌ను పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌క‌టించింది. సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో ఈ అర్హ‌త‌ పరీక్షను (TET) ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ప‌రీక్ష‌లు రెండు సెష‌న్ల‌లో జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించింది. ఉద‌యం 9 నుంచి 11.30 గ‌గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2 నుంచి 4.30 గంట‌ల వ‌ర‌కు వివిధ షెష‌న్ల‌లో జ‌రుగుతాయ‌ని పేర్కొంది.

ఈ ప్రత్యేక టెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,983 మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు (In Service Teachers) దరఖాస్తు చేసుకున్నారు. టీచర్ల అర్హతలు, మాధ్యమాల ఆధారంగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. హాల్ టికెట్లు, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in సందర్శించాలని విద్యాశాఖ సూచించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక పరీక్షను ఏర్పాటు చేసింది.

షెడ్యూల్ ఇలా..

సెప్టెంబర్‌ 8 (మొదటి రోజు): ఉదయం సెషన్‌లో పేపర్-1 పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం సెషన్‌లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు చెందిన ఉపాధ్యాయులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.
సెప్టెంబర్‌ 9 (రెండో రోజు): మధ్యాహ్నం సెషన్‌లో ఇతర మాధ్యమాల (ఉర్దూ, మరాఠీ, కన్నడ తదితర) వారికి పేపర్-2 పరీక్షను పూర్తి చేస్తారు.

Advertisement
Advertisement