Seed Ganesha | గణనాథుడిని పూజిద్దాం.. మొక్కలను నాటుదాం.. ప్రకృతిని కాపాడుదాం..
Seed Ganesha | వినాయక చవితి (Ganesh Chaturthi) వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకుందామని బీఆర్ఎస్ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోశ్ కుమార్ (Santhosh Kumar) పిలుపునిచ్చారు.
Seed Ganesha | త్రినేత్ర.న్యూస్: వినాయక చవితి (Ganesh Chaturthi) వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకుందామని బీఆర్ఎస్ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోశ్ కుమార్ (Santhosh Kumar) పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గణనాథుడిని పూజిద్దాం, మొక్కలను నాటుదాం, ప్రకృతిని కాపాడుదామనే థీమ్‌తో సీడ్ గణేశా (Seed Ganesha) క్యాంపెయిన్‌ను చేపట్టారు. ఈ క్యాంపెయిన్‌ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో గణేశ్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని #SeedGanesha క్యాంపెయిన్‌ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆవిష్కరించి, ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ (GreenIndiaChallenge) సంకల్పాన్ని అభినందిస్తూ.. ఈ పర్యావరణ హిత కార్యక్రమానికి తమ పూర్తి మద్దతును ప్రకటించిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందించిన ప్రోత్సాహకరమైన మాటలు ఖచ్చితంగా మరెంతో మందిని పర్యావరణహితంగా పండుగ జరుపుకునేలా ప్రేరేపిస్తాయని చెప్పారు.
భక్తితో పాటు ప్రకృతిపై బాధ్యతను, సంరక్షణను పెంపొందించేలా చేపట్టిన ఒక చిన్న ప్రయత్నమే ఈ సీడ్ గణేశా అని చెప్పారు. సహజసిద్ధమైన మట్టి, పదార్థాలు, విత్తనాలతో ఈ వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా రూపొందించామన్నారు. పూజ పూర్తయిన తర్వాత ఈ విగ్రహాన్ని బయట ఎక్కడో కాకుండా ఇంట్లోనే సులభంగా నిమజ్జనం చేయవచ్చని వెల్లడించారు. దానికి క్రమం తప్పకుండా నీరు పోస్తే ఆ విగ్రహంలోని విత్తనాలు మొలకెత్తి ఒక అందమైన మొక్కగా ఎదుగుతాయని వెల్లడించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందుకుంటూనే.. మనల్ని లాలించే భూమాత పట్ల మన బాధ్యతను కూడా గుర్తుంచుకుందామని పిలుపునిచ్చారు.
This Ganesh Chaturthi, I am happy to have Megastar Chiranjeevi garu unveil and launch the #SeedGanesha campaign. 🙏
Seed Ganesha is a small effort to bring together devotion and care for nature. Made with natural materials and seeds, the idol can be immersed at home after the… pic.twitter.com/iFcpX8D6En
— Santosh Kumar J (@SantoshKumarBRS) August 31, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Driving Licence | మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్.. ఇకపై ఆ పాఠాలు వినాల్సిందే!
- ●Road Accident | లారీని ఢీకొట్టిన మినీ బస్సు.. డ్రైవర్ సహా ఆరుగురు దుర్మరణం
- ●Moosarambagh Bridge | ఎట్టకేలకు ముగిసిన ముసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్
- ●Special TET | ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్.. పరీక్షలు ఎప్పుడంటే?
- ●Horoscope | ఆగస్టు 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మానసిక ఆందోళన ఎక్కువ!
- ●BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే

Driving Licence | మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్.. ఇకపై ఆ పాఠాలు వినాల్సిందే!

Road Accident | లారీని ఢీకొట్టిన మినీ బస్సు.. డ్రైవర్ సహా ఆరుగురు దుర్మరణం

Moosarambagh Bridge | ఎట్టకేలకు ముగిసిన ముసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్

Special TET | ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్.. పరీక్షలు ఎప్పుడంటే?






