Republic Day 2026 | రిపబ్లిక్ డే వేడుకలు.. ఉదయం 10.30 గంటలకు.. 90 నిమిషాల పాటు కార్యక్రమాలు..
Republic Day 2026 | భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతమంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Republic Day 2026 | భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతమంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. వేలాది మంది ప్రజలు, విదేశీ అతిథులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, డ్రోన్ పర్యవేక్షణ వంటి చర్యలు అమలు చేస్తున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందం ప్రధాన అతిథులుగా హాజరుకానున్నారు. ఈ బృందంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఉండడం విశేషం. భారత్-యురోపియన్ యూనియన్ సంబంధాలకు ఇది మరో కీలక ఘట్టంగా మారనుందని విదేశాంగ వర్గాలు పేర్కొంటున్నాయి.
కర్తవ్య పథ్‌లో జరగనున్న ప్రధాన పరేడ్‌కు ఈసారి వందే మాతరం - 150 సంవత్సరాలు అనే ప్రత్యేక థీమ్‌ను నిర్ణయించారు. దేశభక్తి గీతంగా నిలిచిన వందే మాతరం పాటకు 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా, భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర, జాతీయ భావనను ప్రతిబింబించేలా ప్రదర్శనలు, శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించారు. కాగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై సుమారు 90 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించనున్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారక స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం కర్తవ్య పథ్‌లో పరేడ్ ప్రారంభమవుతుంది. రాష్ట్రపతి ముర్ము పరేడ్‌ను సమీక్షించి గౌరవ వందనం స్వీకరిస్తారు.
ఈ పరేడ్‌కు ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ భవ్నిష్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. త్రివిధ దళాలు, వివిధ రాష్ట్రాల శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధునిక ఆయుధాలు, రక్షణ రంగ ప్రదర్శనలు ఈ పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






