జమ్ముకశ్మీర్‌లో బయటపడ్డ పురాతన బౌద్ధ సంపద
జమ్ముకశ్మీర్‌లో అద్భుత ఘట్టం ఆవిష్కారమైంది. బారాముల్లా జిల్లాలో బౌద్ధ సంపద బయటపడింది. జిల్లాలోని జెహన్‌పోరా అనే ప్రాంతంలో అత్యంత పురాతనమైన, విశాలమైన బౌద్ధ సముదాయం ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా బౌద్ధ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా ఉండేదని చెప్పేందుకు ఈ తవ్వకాల్లో బయటపడ్డ బౌద్ధ సముదాయం నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.
జమ్ముకశ్మీర్‌కు చెందిన పురావస్తు శాఖ అధికారులు, కశ్మీర్ యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ సంయుక్తంగా ఈ తవ్వకాలను చేపట్టాయి. ఈ తవ్వకాల్లో కుషానుల కాలం నాటి ఆనవాళ్లు వెలుగు చూశాయి. కుషానులు క్రీ.శ. 1 నుంచి 3 శతాబ్దానికి చెందిన వారు. వాళ్ల నిర్మాణాలు తాజాగా వెలుగు చూశాయి. స్థూపాలు, గోడలు, మట్టి పాత్రలు, రాగి వస్తువులు బయటపడ్డాయి. కుషానుల కాలం నాటి జీవన విధానానికి అవి అద్దం పడుతున్నాయి.
కశ్మీర్ లోయలో ఒకప్పుడు బౌద్ధ మతం ఎంత బలంగా ఉండేదో చెప్పేందుకు ఈ తవ్వకాలే ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నాయి. కశ్మీర్ యూనివర్సిటీలోని సీసీఏఎస్ పరిశోధకులు డ్రోన్ సర్వే, మ్యాపింగ్ ద్వారా ఈ ప్రదేశాన్ని గుర్తించి గత కొన్ని రోజులుగా తవ్వకాలు ప్రారంభించారు.
చరిత్రలో ఇది కొత్త అధ్యాయం అని కశ్మీర్, బౌద్ధ మత చరిత్ర ఆనవాళ్లు ఇంకా లభించడం వల్ల రాబోయే రోజుల్లో ఈ ప్రదేశాన్ని పర్యాటక, చారిత్రక ప్రదేశంగా మార్చే అవకాశం ఉండొచ్చని కశ్మీర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
#WATCH | Baramulla, J&K: Extensive remains of a significant Buddhist complex uncovered at Zehanpora in Baramulla. The excavation is a joint effort between the J&K Department of Archives, Archaeology and Museums and the Centre of Central Asian Studies (CCAS) at the University of… pic.twitter.com/6mhfABOJLl
— ANI (@ANI) December 6, 2025
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






