త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amarnath Yatra 2026 | జూలై 3 నుంచి అమ‌ర్‌నాథ్ యాత్ర‌.. 15 నుంచి రిజిస్ట్రేషన్స్‌

Amarnath Yatra 2026 | అమ‌ర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra 2026) తేదీలు ఖ‌రార‌య్యాయి. జ‌మ్మూ క‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆదివారం వెల్ల‌డించారు. జూలై 3 (July 3) నుంచి ప్రారంభ‌మై 57 రోజుల పాటు కొన‌సాగి ఆగ‌స్టు 28న (శ్రావణ పూర్ణిమ) ముగుస్తుంద‌ని తెలిపారు.

S

News | Published On Apr 12, 2026, 3.33 pm IST

Amarnath Yatra 2026 | జూలై 3 నుంచి అమ‌ర్‌నాథ్ యాత్ర‌.. 15 నుంచి రిజిస్ట్రేషన్స్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: జ్యేష్ఠ పూర్ణిమ సంద‌ర్భంగా ప్ర‌తి సంవ‌త్స‌రం వైభ‌వంగా నిర్వ‌హించే అమ‌ర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra 2026) తేదీలు ఖ‌రార‌య్యాయి. జ‌మ్మూ క‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆదివారం వెల్ల‌డించారు. జూలై 3 (July 3) నుంచి ప్రారంభ‌మై 57 రోజుల పాటు కొన‌సాగి ఆగ‌స్టు 28న (శ్రావణ పూర్ణిమ) ముగుస్తుంద‌ని తెలిపారు. ఇక్క‌డికి రావాల‌నుకునే భక్తులు ఈనెల‌ 15 నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తుల్లో రిజిస్ట్రేషన్స్‌ చేసుకోవచ్చని సూచించారు. పరమశివుని ఆశీస్సుల కోసం జూన్ 29న 'ప్రథమ పూజ' నిర్వహిస్తామని పేర్కొన్నారు.

దక్షిణ కశ్మీర్‌లోని దిగువ హిమాల‌యాల్లో 3,882 మీటర్ల (13,000 అడుగుల ఎత్తు) ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రాన్ని ఏటా భ‌క్తులు సంద‌ర్శిస్తుంటారు. దేశంలోని అత్యంత ప్రీతిపాత్ర‌మైన‌, ఆధ్యాత్మిక ప్రయాణాలలో ఒకటిగా ఈ యాత్ర‌ను ప‌రిగ‌ణిస్తారు. జమ్మూకశ్మీర్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, ఎస్‌ బ్యాంకులకు దేశవ్యాప్తంగా ఉన్న 554 శాఖల్లో దరఖాస్తుదారులు ముందస్తుగా నమోదు చేసుకోవచ్చు. అమ‌ర్‌నాథ్‌ బోర్డు నిబంధనల ప్రకారం పదమూడేళ్ల లోపు వయసున్న పిల్లలను, 70 ఏళ్లకు పైబడిన వృద్ధులను ఈ యాత్రకు అనుమతి ఉండ‌దు. ఈ పవిత్ర గుహాలయానికి చేసే ఈ యాత్ర సాహ‌సోపేతంగా ఉండ‌డంతో పిల్ల‌ల‌ను, వృద్ధుల‌ను అనుమ‌తించ‌రు.

https://jksasb.nic.in/Yatra-Advisory.html

Advertisement
Advertisement