Tornado in Jammu | జమ్మూలో టోర్నడో.. 10 నిమిషాల పాటు బీభత్సం
Tornado in Jammu | చల్లటి ప్రదేశాలకు పెట్టింది పేరు జమ్మూకశ్మీర్. అలాంటిది చరిత్రలో మొదటిసారి అరుదైన టోర్నడో (Tornado) 10 నిమిషాల పాటు బీభత్సం సృష్టించింది. జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లోని అఖ్నూర్(Agnar)లో జనావాసాలకు దూరంగా సంభవించడంతో ఎటువంటి నష్టం కలగలేదని స్థానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
త్రినేత్ర.న్యూస్: చల్లటి ప్రదేశాలకు పెట్టింది పేరు జమ్మూకశ్మీర్. అలాంటిది చరిత్రలో మొదటిసారి అరుదైన టోర్నడో (Tornado) 10 నిమిషాల పాటు బీభత్సం సృష్టించింది. జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లోని అఖ్నూర్(Agnar)లో జనావాసాలకు దూరంగా సంభవించడంతో ఎటువంటి నష్టం కలగలేదని స్థానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నార్‌వెస్టర్ తుపానుల వల్ల ఏర్పడిన ప్రత్యేక వాతావరణ పరిస్థితులే దీనికి కారణమని చెబుతున్నారు. తాజాగా ఏర్పడిన ఈ టోర్నడో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఈ ప్రాంతంలో మళ్లీ టోర్నడోలు ఏర్పడవని.. ప్రస్తుతం ఆ ఆనవాళ్లు ఎక్కడా లేవని డాప్లర్ వాతావరణ రాడార్ డేటా తెలిపింది. 100 కిలోమీటర్ల పరిధి వరకు టోర్నడోకు సంబంధించి ఎటువంటి సంకేతాలు కనిపించడం లేదని పేర్కొంది. కాగా వందల మీటర్ల ఎత్తు వరకు సంభవించిన ఈ అరుదైన దృశ్యాన్ని చూడడానికి స్థానిక ప్రజలు ఎంతో ఆసక్తి కనబరిచారు. టోర్నడోలు స్తంభం ఆకారంలో వందల మీటర్ల ఎత్తు వరకు ఏర్పడతాయని, ఆ సయయంలో ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అత్యంత శక్తిమంతమైన సుడిగాలులతో ఈ టోర్నడోలు ఏర్పడతాయి. ఇటీవల అమెరికాలోని టెక్సాస్, ఒక్లహామా, మిస్సోరి, కాన్సాస్, కెంటకీ రాష్ట్రాల్లో టోర్నడోలు విధ్వంసం సృష్టించడంతో ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. వందల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిన విషయం విదితమే.
Rarest of the rare!
A tornado spotted in Akhnoor, Jammu yesterday — an extremely unusual event for the region.
Even across Bharat, such fully developed tornadoes are rare. pic.twitter.com/NLXd2DkVJo— Dr. Vineet Kumar (@vineet_mausam) April 12, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






