త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Bharat sleeper | వందే భార‌త్ స్లీప‌ర్ రైలుకు ఫుల్ డిమాండ్‌.. 24గంట‌ల్లోనే టికెట్లు సేల్‌..!

Vande Bharat sleeper | భార‌తీయ రైల్వే ఇటీవ‌ల ప్ర‌తిష్టాత్మ‌కంగా వందే భార‌త్ స్లీప‌ర్ రైలును అసోంలోని కామాఖ్య‌, బెంగాల్ హౌరా మ‌ధ్య ప్రారంభించింది. ఈ రైలుకు ప్ర‌యాణీకుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తున్న‌ది. తొలి ప్ర‌యాణంలోనే అన్ని త‌ర‌గ‌తుల టికెట్లు బుకింగ్స్ ప్రారంభ‌మై 24గంట‌ల్లోనే అమ్ముడ‌య్యాయి.

P

National | Published On Jan 22, 2026, 3.24 pm IST

Vande Bharat sleeper | వందే భార‌త్ స్లీప‌ర్ రైలుకు ఫుల్ డిమాండ్‌.. 24గంట‌ల్లోనే టికెట్లు సేల్‌..!
Advertisement

Vande Bharat sleeper | భార‌తీయ రైల్వే ఇటీవ‌ల ప్ర‌తిష్టాత్మ‌కంగా వందే భార‌త్ స్లీప‌ర్ రైలును అసోంలోని కామాఖ్య‌, బెంగాల్ హౌరా మ‌ధ్య ప్రారంభించింది. ఈ రైలుకు ప్ర‌యాణీకుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తున్న‌ది. తొలి ప్ర‌యాణంలోనే అన్ని త‌ర‌గ‌తుల టికెట్లు బుకింగ్స్ ప్రారంభ‌మై 24గంట‌ల్లోనే అమ్ముడ‌య్యాయి. రైల్వే ప్రకారం.. జనవరి 22న కామాఖ్యా నుంచి బయలుదేరే వందే భారత్ స్లీపర్ రైలు కోసం పీఆర్ఎస్‌, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో బుకింగ్ మొద‌లైన కొద్దిగంట‌ల్లోనే సీట్ల‌న్నీ అమ్ముడ‌య్యాయి.

దేశంలోనే తొలి స్లీప‌ర్ వందే భార‌త్ రైలును జనవరి 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు నేటి కామాఖ్య నుంచి, 23న హౌరా నుంచి రోజువారీ కార్య‌క‌లాపాలు మొద‌ల‌వుతాయి. రైలులో టికెట్ల బుకింగ్ జ‌న‌వ‌రి 19న ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. అన్ని క్లాస్‌ల టికెట్లు 24 గంట‌ల్లోనే అమ్ముడ‌య్యాయి. దాంతో రైలుపై ప్ర‌యాణీకుల్లో ఉన్న ఉత్సాహాన్ని ప్ర‌తిబింబిస్తుంద‌ని రైల్వేవ‌ర్గాలు తెలిపాయి. కామాఖ్య-హౌరా వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ఈశాన్య‌, తూర్పు భార‌త‌దేశాల మ‌ధ్య ట్రాఫిక్‌ను గ‌ణ‌నీయంగా మెరుగుప‌రుస్తుంద‌ని భావిస్తున్నారు. రైలులో అత్యాధునిక సదుపాయాలు ఉండ‌డంతో పాటు త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ దూరం ప్ర‌యాణిస్తుంది.

ఇదిలా ఉండ‌గా.. భార‌తీయ రైల్వే స్లీప‌ర్ రైళ్లలో టికెట్ క్యాన్సిలేష‌న్ రూల్స్‌ను క‌ఠిన‌త‌రం చేసింది. ఈ నెల 16న మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రైలు బ‌యలుదేర‌డానికి ఎనిమిది గంట‌ల ముందు క‌న్ఫ‌ర్మ్ టికెట్‌ను ర‌ద్దు చేస్తే ప్ర‌యాణీకుల‌కు రూపాయి కూడా రీఫండ్ ఇవ్వ‌రు. ప్ర‌యాణానికి 72 గంట‌ల ముందు రద్దు చేస్తే 25శాతం కోత విధిస్తారు. రైల్వే ప్యాసింజర్ రూల్స్ 2025ని స‌వ‌రిస్తూ ఈ నిబంధ‌న‌ల‌ను అమ‌లులోకి తీసుకువ‌చ్చారు. మిగ‌తా రైళ్ల‌లో రైలు బ‌య‌లుదేర‌డానికి నాలుగు గంట‌ల కంటే త‌క్కువ స‌మ‌యంలో క‌న్ఫ‌ర్మ్ టికెట్ల‌ను ర‌ద్దు చేస్తే ప్ర‌యాణీకుల‌కు రీఫండ్ ఇవ్వ‌డం లేదు.

Advertisement

తాజావార్తలు

Advertisement