Rahul Gandhi vs Rajnath Singh | లోక్‌సభలో రాహుల్ Vs కేంద్రం.. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని అడ్డుకున్న అధికార పక్షం
Rahul Gandhi vs Rajnath Singh | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి.
Rahul Gandhi vs Rajnath Singh | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ప్రభుత్వం, విపక్ష కూటమి సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.
ఇవాళ ఉదయం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా చైనా అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే (Ex Army chief General MM Naravane) తన పుస్తకంలో రాసుకున్న కొన్ని అంశాలను రాహుల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ వివరాలను ఓ మ్యాగజైన్ ప్రచురించింది. మ్యాగజైన్‌లో ప్రచురించిన పేజీలను సభలో రాహుల్ చూపించారు. అయితే, అధికార పక్షం రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకుంది. పబ్లిష్ కాని పుస్తకంలోని అంశాలను రాహుల్ ప్రస్తావిస్తున్నారంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మండిపడ్డారు. ప్రచురించని పుస్తకాన్ని ఉటంకించడం సభ నియమాలకు విరుద్ధమన్నారు.
రక్షణ మంత్రితోపాటూ హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు కూడా రాహుల్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. రగడపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, పబ్లిష్ కాని పుస్తకాలకు సంబంధించిన విషయాలను లోక్‌సభలో ప్రస్తావించకూడదని సూచించారు. ఈ మేరకు రూల్ బుక్ నియమాలను సభలో చదివి వినిపించారు.
కాగా, పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో భారత్-చైనా దళాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత 2020 మే5న తూర్పు లఢఖ్ సరిహద్దు వివాదం చెలరేగింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’లో ఈ ఘర్షణ గురించి ప్రస్తావించారు. ఆ వివరాలను ఓ మ్యాగజైన్ ప్రచురించింది. ఆ వివరాలనే ఇప్పుడు రాహుల్ లోక్‌సభలో ప్రస్తావించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






