త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | హిట్ అండ్ ర‌న్ కేసులో ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయి కొడుకు అరెస్ట్

హిట్ అండ్ ర‌న్ కేసులో టాలీవుడ్ ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్ అయ్యాడు. ఖాజాగూడ వ‌ద్ద జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి చ‌నిపోగా...మ‌రో యువ‌కుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈకేసులో ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను రాయ‌దుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.

N

Entertainment | Published On Sep 1, 2026, 2.21 pm IST

Tollywood | హిట్ అండ్ ర‌న్ కేసులో ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయి కొడుకు అరెస్ట్
Advertisement

Tollywood | హిట్ అండ్ ర‌న్ కేసులో టాలీవుడ్ ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్ అయ్యాడు. కారుతో ఓ వ్య‌క్తిని ఢీ కొట్ట‌డ‌మే కాకుండా ఆప‌కుండా వెళ్లిపోయిన ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌పై రాయదుర్గం పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఓఆర్ఆర్ రోట‌రీ నుంచి ఖాజాగూడ వైపు నందులాల్ అనే వ్య‌క్తి న‌డుచుకుంటూ వెళుతున్నాడు. అత‌డిని ఓ ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన నందులాల్‌ను జైషా ఖాద్రీ అనే స్టూడెంట్ హాస్పిట‌ల్‌కు తీసుకెళుతుండ‌గా...వారిద్ద‌రిని ఆనంద్ సాయి కుమారుడు సందీప్ త‌న‌ మ‌హీంద్ర ఈవీ కారుతో బ‌లంగా ఢీకొట్టాడు. ఈ ప్ర‌మాదంలో నందులాల్ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా...యువ‌కుడికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ప్ర‌మాదం త‌ర్వాత కారు ఆప‌కుండా సందీప్ వెళ్లిపోయినట్లు సమాచారం. సీపీ ఫుటేజీ ఆధారంగా కారు న‌డిపింది సందీప్‌గా గుర్తించిన రాయ‌దుర్గం పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆనంద్ సాయి కుమారుడిని అరెస్ట్ చేశారు. మితిమీరిన వేగం, నిర్ల‌క్ష్య‌పు డ్రైవింగ్ కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలిసింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఆప్తుడిగా...

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి స‌న్నిహితుడిగా ఆనంద్ సాయి కొన‌సాగుతోన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి ప్రేమ సినిమాతోనే ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఆనంద్ సాయి కెరీర్ మొద‌లైంది. కెరీర్‌లో ఎక్కువ‌గా ప‌వ‌న్ సినిమాల‌కే ప‌నిచేశారు. త‌మ్ముడు, గుడుంబా శంక‌ర్‌, వాసు, నాని, సై, జ‌ల్సా, అదుర్స్‌తో పాటు ప‌లు సినిమాలు ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఆనంద్ సాయికి మంచి పేరు తెచ్చెపెట్టాయి. త‌మ్ముడులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రిగా న‌టించిన వాసుకిని పెళ్లి చేసుకున్నారు ఆనంద్‌.

 

Advertisement
Advertisement