Rahul Gandhi | పని హక్కును బీజేపీ లాక్కోవాలనుకుంటుంది : రాహుల్ గాంధీ
Rahul Gandhi | ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పార్టీలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ఎంఎన్ఆర్ఈజీఏను కాపాడండి' క్యాంపెయిన్‌లో ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో పేదలకు పని చేసే హక్కు ఉండేదని.. బీజేపీ ఆ పథకాన్ని ముగింపు పలకాలను చూస్తోందన్నారు.
Rahul Gandhi | ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పార్టీలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ఎంఎన్ఆర్ఈజీఏను కాపాడండి' క్యాంపెయిన్‌లో ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో పేదలకు పని చేసే హక్కు ఉండేదని.. బీజేపీ ఆ పథకాన్ని ముగింపు పలకాలను చూస్తోందన్నారు. ఎంఎన్ఆర్ఈజీఏ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రాహుల్ గాంధీ వ్యవసాయ చట్టాలతో పోల్చారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలతో రైతులకు ఏం చేశారో.. ప్రస్తుతం కార్మికులకు అదే చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. కొన్నేళ్ల కిందట బీజేపీ రైతులపై దాడి చేసిందని.. కానీ, రైతులు, మనమంతా నరేంద్ర మోదీపై ఒత్తిడి తెచ్చి చట్టాలను ఆపగలిగామన్నారు. కార్మికులపై కూడా అలాంటి దాడికే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన ఆయన.. కేవలం ఒకే రోజు అన్నీ నిర్ణయించే భారత్‌ను బీజేపీ సృష్టించాలనుకుంటోందని రాహుల్ విమర్శించారు.
ప్రతి రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించాలనేది ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాలకు తక్కువ డబ్బు అందుతుందన్నారు. పని ఎప్పుడు.. ఎక్కడ చేయాలి.. వారికి ఎంత వేతనం ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. ఇంతకుముందు కార్మికులకు ఉన్న హక్కులు కాంట్రాక్టులకు వెళ్తాయన్నారు. దేశ సంపద, ఆస్తి కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఉండాలని, వారే ఈ దేశాన్ని పాలించాలి అనేది బీజేపీ సిద్ధాంతమని ఆరోపించారు. దేశ సంపద మొత్తం ధనవంతుల చేతుల్లోకి వెళ్లాలని బీజేపీ కోరుకుంటోందని, తద్వారా పేదలు, దళితులు, గిరిజనులు వారిపై ఆధారపడి, వారికి విధేయులుగా ఉండాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఒక వ్యక్తి ఒక ఓటు అనే భావనను బీజేపీ నిర్మూలించాలని చూస్తోందన్నారు. పిరిపికిపంద బీజేపీని ఆపేందుకు అందరం కలిసి నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ ఏకతాటిపైకి వస్తే నరేంద్ర మోదీ వెనక్కి తగ్గక తప్పదని, మళ్లీ ఎంఎన్ఆర్ఈజీఎస్‌ని అమలు చేస్తారన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






