త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rains | హైద‌రాబాద్‌లో మోస్తరు వ‌ర్షం.. ఉక్క‌పోత‌కు ఉప‌శ‌మ‌నం

Rains | మొత్తానికి మండుటెండ‌ల నుంచి హైద‌రాబాదీల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. రాత్రి వ‌ర‌కు కూడా ఉక్క‌పోత‌తో ఉక్కిరిబిక్కిరి అయిన న‌గ‌ర‌వాసుల‌కు వ‌ర్షం( Rain ) రిలీఫ్‌ను ఇచ్చింది.

S

Hyderabad | Published On Jul 16, 2026, 4.18 pm IST

Rains | హైద‌రాబాద్‌లో మోస్తరు వ‌ర్షం.. ఉక్క‌పోత‌కు ఉప‌శ‌మ‌నం
Advertisement

Rains | త్రినేత్ర‌.న్యూస్ : మొత్తానికి మండుటెండ‌ల నుంచి హైద‌రాబాదీల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. రాత్రి వ‌ర‌కు కూడా ఉక్క‌పోత‌తో ఉక్కిరిబిక్కిరి అయిన న‌గ‌ర‌వాసుల‌కు వ‌ర్షం( Rain ) రిలీఫ్‌ను ఇచ్చింది. గురువారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు వ‌ర్షం కురిసింది.

మ‌ణికొండ‌, రాజేంద్ర‌న‌గ‌ర్, షేక్‌పేట‌, శంషాబాద్, టోలిచౌకి, గోల్కొండ ప్రాంతాల్లో మోస్త‌రు వ‌ర్షం కురిసిన‌ట్లు తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ప‌శ్చిమ‌, తూర్పు హైద‌రాబాద్‌లో కూడా వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. మ‌రో 2 గంట‌ల్లో ఉప్ప‌ల్, బోడుప్ప‌ల్, పీర్జాదిగూడ‌, నార‌ప‌ల్లి, ఘ‌ట్‌కేస‌ర్, త‌ట్టిఅన్నారం, హ‌య‌త్‌న‌గ‌ర్, కుంట్లూరు, పెద్ద అంబ‌ర్‌పేట‌లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు.

ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు, వాహ‌న‌దారులు, ప్ర‌యాణికులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని తెలిపారు. ఈ వ‌ర్షాలు జూలై 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని ఇప్ప‌టికే బాలాజీ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement
Advertisement