త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Siddaramaiah vs DK Shivakumar | కర్ణాటక కాంగ్రెస్‌లో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’.. కొత్త సీఎంగా డీకే శివకుమార్? హైకమాండ్ ప్లాన్ ఇదే

కర్ణాటకలో నాయకత్వ మార్పు తథ్యమా? సీఎం పీఠంపై డీకే శివకుమార్‌ను కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యంగా ప్రియాంకా గాంధీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.

J

National | Published On May 26, 2026, 6.04 pm IST

Siddaramaiah vs DK Shivakumar | కర్ణాటక కాంగ్రెస్‌లో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’.. కొత్త సీఎంగా డీకే శివకుమార్? హైకమాండ్ ప్లాన్ ఇదే
Advertisement

Siddaramaiah vs DK Shivakumar | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) సిద్ధమైంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అగ్రనేతల కీలక సమావేశంలో నాయకత్వ మార్పుపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) డీకే శివకుమార్‌ను సీఎంగా చేయాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీలో ఏం జరిగింది?

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఈ కీలక మీటింగ్‌లో పాల్గొన్నారు. వయసు, తదితర కారణాల రీత్యా సిద్ధరామయ్యను సీఎంగా గౌరవప్రదంగా తప్పించి (బహుశా ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసి), 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని సిద్ధం చేసే బాధ్యతను డీకేఎస్‌కు అప్పగించే ఫార్ములాపై గంటల తరబడి నేతలు చర్చలు జరిపారు.

మార్పు ఎందుకు అవసరం?

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను (Anti-incumbency) తగ్గించాలంటే నాయకత్వ మార్పు తప్పనిసరి అని కాంగ్రెస్ భావిస్తోంది. సిద్ధరామయ్యకు మైనార్టీ, బీసీ, దళిత వర్గాల (అహిందా - Ahinda) ఓటు బ్యాంకు అండగా ఉండటంతో ఇన్నాళ్లూ ఆయనను కదిలించేందుకు హైకమాండ్ వెనక్కి తగ్గింది. కానీ, 2028 నాటికి ఆయన వయసు 80 ఏళ్లకు చేరుకోనుండటం, పాలనాపరంగా ఆశించిన స్థాయిలో మార్కులు పడకపోవడంతో మార్పు అనివార్యంగా మారింది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగా తప్పుకోవడమే దీనికి సరైన పరిష్కారమని అధిష్ఠానం భావిస్తోంది.

డీకే శివకుమార్ బలం ఏంటి?

ప్రస్తుతం డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ (PCC Chief) రెండు కీలక పదవుల్లో ఉన్న డీకే శివకుమార్.. కాంగ్రెస్‌ పార్టీలో 'ట్రబుల్ షూటర్'గా పేరు తెచ్చుకున్నారు. ఆయన జేడీఎస్ (JDS) కంచుకోటగా భావించే 'వొక్కలిగ' సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. ఆయన్ని సీఎం చేస్తే, జేడీఎస్, బీజేపీ కూటమికి గండికొట్టి ఆ ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవచ్చని పార్టీ వ్యూహం. అయితే డీకేఎస్‌పై ఉన్న అవినీతి ఆరోపణలు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే ప్రమాదం లేకపోలేదు.

పవర్ షేరింగ్ ఒప్పందం

గతేడాది (2025 నవంబర్) కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. 2023 ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య, డీకేఎస్ మధ్య 'చెరో రెండున్నరేళ్లు' సీఎం సీటు పంచుకునేలా ఒప్పందం జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, తమిళనాడులో నటుడు విజయ్‌కి చెందిన టీవీకే (TVK) పార్టీతో కలిసి అధికారం పంచుకోవడం లాంటి పరిణామాలతో దక్షిణాదిలో ఆ పార్టీ మంచి ఊపుమీదుంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో కర్ణాటకలోనూ సీఎం మార్పు ద్వారా 2028 ఎన్నికలకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఈ పోరుకు ముగింపు పలికేందుకు కర్ణాటక సీనియర్ నేతలంతా ఇప్పుడు ఢిల్లీ బాట పడుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement