త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cricket Stadium | బెంగ‌ళూరులో కొత్త క్రికెట్ స్టేడియం.. రూ.943కోట్ల‌తో నిర్మాణం..!

Cricket Stadium | క‌ర్నాట‌క‌లో మ‌రో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. బెంగ‌ళూరు న‌గ‌ర శివారులోని సూర్య‌న‌గ‌ర్ ప్రాంతంలో రూ.943కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్నారు. నిర్మాణానికి క‌ర్నాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య భూమిపూజ చేశారు.

P

Sports | Published On May 24, 2026, 5.09 pm IST

Cricket Stadium | బెంగ‌ళూరులో కొత్త క్రికెట్ స్టేడియం.. రూ.943కోట్ల‌తో నిర్మాణం..!
Advertisement

Cricket Stadium | క‌ర్నాట‌క‌లో మ‌రో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. బెంగ‌ళూరు న‌గ‌ర శివారులోని సూర్య‌న‌గ‌ర్ ప్రాంతంలో రూ.943కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్నారు. నిర్మాణానికి క‌ర్నాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య భూమిపూజ చేశారు. ఇది దేశంలోనే రెండో అతిపెద్ద స్టేడియంగా నిలువ‌నుంది. అహ్మ‌దాబాద్ దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా నిలిచిన విష‌యం తెలిసిందే. గ‌తేడాది చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న త‌ర్వాత అంత‌ర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం అవ‌స‌రం ఉంద‌ని భావించిన‌ట్లుగా సీఎ వెల్ల‌డించారు.

కొత్త స్టేడియాన్ని 80వేల సీటింగ్ సామ‌ర్థ్యంతో భారీ పెద్ద స్టేడియాన్ని నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. నిర్మాణం పూర్త‌యితే దేశంలోనే రెండో అతిపెద్ద స్టేడియంగా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు. అనేక‌ల్‌లో భార‌త్‌లోనే అతిపెద్ద ప్ర‌పంచ స్థాయి క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్న‌ట్లు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ తెలిపారు. క‌ర్నాట‌క‌లో క్రీడా మౌలిక స‌దుపాయాల‌ను బ‌లోపేతం చేయ‌డంలో ఇది ముందుడుగుగా పేర్కొన్నారు. రూ.943.46 కోట్ల వ్యయంతో.. 80వేల సీటింగ్ సామర్థ్యంతో నిర్మిస్తున్న‌ట్లు పేరొ్క‌న్నారు. ఈ చారిత్రాత్మక ప్రాజెక్టులో ప్రధాన జాతీయ, అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల కోసం ఆధునిక సౌకర్యాలు ఉంటాయ‌ని తెలిపారు. బెంగళూరు ప్రతి రంగంలోనూ ప్రపంచ ప్రమాణాలకు సరిపోయే నగరంగా ముందుకు సాగుతోంద‌ని ఆయ‌న సోష‌ల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement