త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshkumar Goud | బాగా ప‌ని చేయండి.. బూత్ స్థాయి నుంచే పార్టీని బ‌లోపేతం చేద్దాం: మ‌హేశ్‌కుమార్‌గౌడ్

Maheshkumar Goud | కాంగ్రెస్ ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన బాధ్య‌త పార్టీ నాయ‌కుల‌పై ఉంద‌ని.. బూత్ స్థాయి నుంచి పార్టీని బ‌లోపేతం చేయాల‌ని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ సూచించారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

S

Telangana | Published On May 26, 2026, 6.27 pm IST

Maheshkumar Goud | బాగా ప‌ని చేయండి.. బూత్ స్థాయి నుంచే పార్టీని బ‌లోపేతం చేద్దాం: మ‌హేశ్‌కుమార్‌గౌడ్
Advertisement
  • క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన‌వారికే గుర్తింపు
  • మ‌ళ్లీ వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వమే
  • 75 ల‌క్ష‌ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటాం
  • కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ క‌మిటీ స‌మావేశంలో టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్‌గౌడ్

Maheshkumar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన బాధ్య‌త పార్టీ నాయ‌కుల‌పై ఉంద‌ని.. బూత్ స్థాయి నుంచి పార్టీని బ‌లోపేతం చేయాల‌ని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ సూచించారు. మంగ‌ళ‌వారం కామారెడ్డిలో జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి..

బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుప‌డాలి. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమం కొన‌సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు వ‌చ్చాయి. స్వాతంత్య్రం త‌ర్వాత‌ దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా కుల గణన సర్వే నిర్వహించాం అని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌, బీజేపీ మొస‌లి క‌న్నీరు కారుస్తున్నాయి..

వరి వేస్తే ఉరి అని బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఇప్పుడు రైతులపై బీఆర్ఎస్, బీజేపీ మొసలి కన్నీరు కారుస్తున్నాయి. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ హయాంలో కల్లాల్లో రైతులు ప్రాణాలు విడిచిన సంఘటనలు మరిచిపోలేదు. మాది చేతల ప్రభుత్వం బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా స్పష్టంగా ఉంది. ఎవరెన్ని చెప్పినా మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. * స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో 75 శాతానికి పైగా సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం అని మ‌హేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు.

ఇల్లు లేని పేదలకు ఇళ్లు అందజేయాలన్నది ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కల. విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసి పలాయనం చిత్తగించినా మొక్కవోని ధైర్యంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల నేతృత్వంలో నిస్వార్థంగా పాలన అందిస్తున్నాం అని మ‌హేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో డీసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, టీపీసీసీ కోఆర్డినేటర్లు, జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement