Keralam Election Results | కాంగ్రెస్‌కు బూస్ట్.. కేరళంలో యూడీఎఫ్ కూటమి జయకేతనం..!
త్రినేత్ర.న్యూస్ : కేరళం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ఊరటనిచ్చాయి. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీనపడుతోందని అందరూ భావించారు. ప్రస్తుతం ఆ పార్టీ మళ్లీ పూర్వవైభవం దిశగా సాగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ బలపడుతోందా అంటే.. ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
- దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ సత్తా
- కర్నాటక, తెలంగాణ తర్వాత కేరళంలో అధికారంలోకి
- ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో అధికారం
త్రినేత్ర.న్యూస్ : కేరళం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ఊరటనిచ్చాయి. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీనపడుతోందని అందరూ భావించారు. ప్రస్తుతం ఆ పార్టీ మళ్లీ పూర్వవైభవం దిశగా సాగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ బలపడుతోందా అంటే.. ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కర్నాటకలో విజయం తర్వాత ఆ పార్టీ తెలంగాణలోనూ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాలు ఆ పార్టీ కార్యకర్తల్లో విశ్వాసాన్ని నింపాయి. ఈ నేపథ్యంలోనే కేరళలో యూడీఎఫ్ కూటమి దశాబ్దం తర్వాత మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది.
సంపూర్ణ ఆధిక్యంతో..
కేరళలో యూడీఎఫ్ కూటమి సంపూర్ణ ఆధిక్యం సంపాదించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఇప్పటి వరకు 63 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 36 చోట్ల లీడ్‌లో ఉంది. ఇక ఎల్‌డీఎఫ్ కూటమి 25 చోట్ల గెలుపొందగా.. మరో 10 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించింది. మరో నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది. స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ కూటమి విజయంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దశాబ్ద కాలం పాటు అధికారంలో కొనసాగుతూ వచ్చిన ఎల్‌డీఎఫ్ కూటమి.. హ్యాట్రిక్ విజయంపై కన్నేయగా.. ఆ ఆశలకు కాంగ్రెస్ గండికొట్టింది. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం తగ్గుతూ వస్తోంది. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నది. ప్రస్తుతం ఆ పార్టీ కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ అధికారంలో ఉంది. ఇక నిన్నటి వరకు తమిళనాడులో డీఎంకే కూటమిలో కొనసాగింది.
జాతీయ రాజకీయాల్లో..
జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ బలమైన పార్టీ కొనసాగుతున్నది. అయితే, ప్రతిపక్షాల ఐక్యత, ప్రాంతీయ సమీకరణాలు కాంగ్రెస్‌కు కొత్త అవకాశాలను తెరుస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా వస్తున్న సానుకూల ఫలితాల నేపథ్యంలో త్వరలోనే మళ్లీ ఆ పార్టీ జాతీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, త్వరలో జరుగనున్న ఎన్నికల ఫలితాలపైనే కాంగ్రెస్ భవిష్యత్‌ను నిర్దేశించనున్నాయి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఆ పార్టీ వెనుకపడ్డా.. గతంలో పోలిస్తే ప్రస్తుతం మళ్లీ పుంజుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2014 లోక్‌సభ ఎన్నికల నుంచి ప్రతిపక్షంలో..
2014 తర్వాత తర్వాత కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్రలోనే కొనసాగుతోంది. అయితే, ఇటీవల ఎన్నికల్లో విజయాలు, కూటమి రాజకీయాల్లో పెరుగుతున్న ప్రభావం పార్టీకి మళ్లీ బలాన్ని ఇస్తున్నట్లుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రస్తుతం ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది. ఈ కూటమి ద్వారా బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కేరళంలో కాంగ్రెస్ చరిత్ర
కేరళం రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్య్రానంతరం ట్రావెన్‌కోర్–కొచ్చిన్ రాష్ట్రం నుంచి.. 1956లో కేరళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సైతం కాంగ్రెస్ అనేక దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా నిలిచింది. లెఫ్ట్ పార్టీలు బలపడినా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికారాన్ని చేపట్టింది. కేరళ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పాలన బాధ్యతలు చేపట్టింది. ట్రావెన్‌కోర్-కొచ్చిన్ స్టేట్ సీఎంగా పని చేసిన ప్రముఖ కాంగ్రెస్ ప్రముఖ నేతల్లో పినంపిల్లై గోవింద మీనన్ ఒకరు. కేరళ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్ శంకర్ 1962లో సీఎంగా నియాకమయ్యారు. కాంగ్రెస్ నుంచి సీఎంగా పని చేసిన దళిత నేతల్లో ఆయన ఒకరు. 1970 తర్వాత కాంగ్రెస్ యూడీఎఫ్ కూటమితో మరింత బలపడింది. ఆ తర్వాత కే కరుణాకరణ్, ఏకే ఆంటోనీ, వుమెన్ చాంది సైతం ముఖ్యమంత్రులుగా పని చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



