President Droupadi Murmu | క్షయవ్యాధి నిర్మూలనకు ఐక్యంగా కృషి చేయాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు
President Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్షయవ్యాధి నిర్మూలన కోసం అన్ని వర్గాలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇది ఇంకా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా ఉందని ఆమె పేర్కొన్నారు.
President Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్షయవ్యాధి నిర్మూలన కోసం అన్ని వర్గాలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇది ఇంకా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా ఉందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ప్రతి సంవత్సరం మార్చి 24న నిర్వహించే ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ఆమె ఈ సందేశాన్ని ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి (టీబీ) సవాలును గురించి అవగాహన పెంచేందుకు మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం జరుపుకుంటున్నందుకు తనకు ఆనందంగా ఉందని ముర్ము తెలిపారు.
అన్ని వర్గాలు ఐక సంకల్పంతో కలసి పనిచేయాలి..
దేశంలో కొనసాగుతున్న చర్యలను ప్రస్తావిస్తూ, టీబీ ముక్త భారత్ అభియాన్ ద్వారా త్వరగా నిర్ధారణ, ఉచిత చికిత్స, పోషకాహార సహాయం, మెరుగైన రోగి సంరక్షణ వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించామని ఆమె చెప్పారు. ఈ అభివృద్ధి జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద దేశం పాటిస్తున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆమె పేర్కొన్నారు. క్షయవ్యాధి ఇంకా ఒక ప్రధాన ప్రజారోగ్య సవాలుగా కొనసాగుతోందని, దీన్ని పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని వర్గాలు ఐక్యసంకల్పంతో కలిసి పనిచేయాలని తాను కోరుతున్నానని రాష్ట్రపతి అన్నారు.
బీహార్ ప్రజలకు శుభాకాంక్షలు..
కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీహార్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. ఎక్స్‌లో పెట్టిన పోస్టులో బీహార్ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసిస్తూ, అక్కడి ప్రజల ప్రతిభ, కృషిపై విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో నివసిస్తున్న బీహార్ ప్రజలందరికీ బీహార్ దినోత్సవ శుభాకాంక్షలు, ప్రపంచపు తొలి గణతంత్రంగా నిలిచిన ఈ నేల, మహా సామ్రాజ్యాల పుట్టినిల్లు, గొప్ప సాంస్కృతిక-ఆధ్యాత్మిక సంప్రదాయాల కేంద్రంగా భారతదేశాన్ని అనేక రంగాల్లో సంపన్నం చేసిందని, రాష్ట్ర ప్రజలు తమ అపార ప్రతిభ, కృషితో బీహార్, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని తనకు విశ్వాసం ఉందని తెలిపారు. రాష్ట్రానికి, ప్రజలందరికీ బంగారు భవిష్యత్తు కలగాలని ఆకాంక్షిస్తున్నానని ఆమె పోస్టులో పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Health Department | మాతాశిశు ఆరోగ్య సేవల్లో తెలంగాణకు జాతీయ గుర్తింపు.. కేంద్రం నుంచి రూ.200 కోట్ల అదనంగా నిధులు..!
జులై 20, 2026

Padma Awards 2026 | నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పురస్కారాలు ప్రదానం చేయనున్న ప్రెసిడెంట్
జూన్ 23, 2026

Droupadi Murmu | భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
- ●Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
- ●Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!



